Star Heroine: సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు, స్టార్ హీరోల చెల్లెలి పాత్రలు చేయడానికి అంతగా ఆసక్తి చూపరు. ఎందుకంటే తమ రాబోయే సినిమా అవకాశాలపై.. ఏదైనా ప్రభావం పడుతుందని హీరోయిన్లు చెల్లెలి పాత్ర చేయడానికి ఒప్పుకోరు. ఇలా కేవలం అప్పట్లో సావిత్రి ఎన్టీఆర్ లకు మాత్రమే సాధ్యమైంది.
ఎన్నో సినిమాల లో హీరో హీరోయిన్ గా మెప్పించిన ఎన్టీఆర్ సావిత్రి లు రక్తసంబంధం సినిమాలో అన్న చెల్లెల్లు గా అప్పటి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు స్టార్ హీరోయిన్ లు స్టార్ హీరోల చెల్లెలు గా నటించడానికి ఒక రేంజ్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇప్పుడు ఆ హీరోయిన్ ల వివరాలు మనం తెలుసుకుందాం.
ప్రస్తుతం కెరీర్ పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతున్న నయనతార గురించి మనకు తెలిసిందే. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఈ అమ్మడు బిజీగా ఉంది. ఈ క్రమంలో చిరంజీవి నటించే గాడ్ ఫాదర్ సినిమాలో కూడా నయనతార నటిస్తోంది. కాగా ఈ సినిమాలో నయనతార చిరంజీవి చెల్లెలు గా కనిపిస్తుందని పలు వార్తలు ద్వారా తెలుస్తోంది.
ఇక మహానటి కీర్తి సురేష్ కూడా కెరీర్ పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతుంది. ఈ క్రమంలో అడపదడపా సినిమా అవకాశాలు తన సొంతం చేసుకుంటుంది ఈ బ్యూటీ. ఇటీవల రజనీకాంత్ పెద్దన్న సినిమాలో రజినీకాంత్ చెల్లెలుగా నటించింది. ఇక ప్రస్తుతం చిరంజీవి బోళా శంకర్ సినిమాలో ఈ అమ్మడు ప్రధాన పాత్రలో చిరు చెల్లెలు గా నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Star Heroine: పూజా హెగ్డే అన్నయ్య గా నటిస్తున్న స్టార్ హీరో ఇతడే!
ఇక బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి మనందరికీ తెలిసిందే. ఈ అమ్మడు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన కబీ ఈద్ కబీ దీవాలి అనే సినిమాలో నటిస్తుంది. కాగా ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ పూజా హెగ్డే అన్నయ్యగా ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.