Star Heroines: ఒకప్పుడు హీరోయిన్లు ఎంతో పద్ధతిగా పెళ్లి చేసుకుని పిల్లలకు జన్మనిచ్చేవారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో ట్రెండ్ మారింది. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కావడం ప్రెగ్నెన్సీని ప్రకటించి పెళ్లి చేసుకోవడం ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. మరి కొంతమంది సెలబ్రిటీలైతే ఏకంగా పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ట్రెండ్ బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కొనసాగుతోంది.ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగుతూ పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీని ప్రకటించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే…
బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అలియా భట్ గత ఏడాది బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలావీరిద్దరూ గత కొంతకాలంగా డేటింగ్ లో ఉంటూ గత ఏడాది ఏప్రిల్ 14వ తేదీ పెళ్లి చేసుకున్నారు. అయితే నవంబర్ నెలలోనే ఆలియా పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.దీన్ని బట్టి చూస్తే ఈమె పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్ అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే డెలివరీ తర్వాత అలియా సైతం ఇదే విషయాన్ని వెల్లడించి తన పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ప్రకటించారు.
ఇక నటి నేహా ధూపియా వ్యవహారం కూడా ఇలాంటిదే. ఆమె కూడా పెళ్లికి ముందే గర్భందాల్చింది. దీంతో ఇరు కుటుంబ సభ్యులు హుటాహుటిన నేహాధూపియా, అంగద్ బేడీకి పెళ్లి చేశారు. 2018 మే నెలలో వీళ్ల పెళ్లి జరగగా అదే ఏడాది మే నెలలోని ఈ దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. లిస్ట్ లో దియా మీర్జా, కల్కి కొచ్లిన్ కూడా ఉన్నారు.వీరు కూడా పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ ని ప్రకటించి అనంతరం పెళ్లి చేసుకున్నారు.
Star Heroines: ప్రెగ్నెన్సీ ప్రకటించిన ఇలియానా..
ఇక నటి ఏమీ జాక్సన్ సైతం బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ప్రియుడితో బ్రేకప్ చెప్పుకొని ప్రస్తుతం మరొక ప్రియుడుతో రిలేషన్ లో కొనసాగుతున్నారు. ఇకపోతే తాజాగా గోవా బ్యూటీ ఇలియానా సైతం పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.అయితే ఈమె ప్రియుడు ఎవరు ఏంటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు కానీ తను కూడా తన బేబీ కోసం ఎదురుచూస్తున్నాను అంటూ గత కొద్ది రోజుల క్రితం చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది. ఇలా ఈ సెలబ్రిటీలందరూ పెళ్ళికి ముందు ప్రెగ్నెన్సీని ప్రకటించారు.