Subhalekha Sudhakar: నందమూరి తారక రామారావు మనవడిగా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇక ఇటీవల రాజమౌళి దర్శకత్వం ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా మంచి క్రేజీ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సినిమాలో సినిమాలో తారక్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఇక తాజాగా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా వరించింది. ఇలా ఆస్కార్ రావడంతో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు.
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ తో పని చేసిన నటీ, నటులు అందరూ ఆయన నటన , డైలాగ్ డెలివరీ చూసి ఆశ్చర్యపోతుంటారు. ఇక తాజాగా ఎన్టీఆర్ నటన గురించి సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నో సుపార్ హిట్ సినిమాలలో కీలక పాత్రలలో నటించిన శుభలేఖ సుధాకర్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. అరవింద సమేత సినిమా విడుదలైన సమయంలో ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధాకర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక వండర్ కిడ్..అలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Subhalekha Sudhakar కెమెరా కోసమే ఎన్టీఆర్ పుట్టాడు…
ఈ ఇంటర్వ్యు లో ఎన్టీఆర్ నటన గురించి ప్రస్తావన వచ్చినప్పుడు శుభలేఖ సుధాకర్ స్పందిస్తూ..” ఎన్టీఆర్ నటన గురించి ఏం చెప్పినా తక్కువే. ఆయన డైలాగ్ ఎప్పుడు చదువుతాడో ఏమో కానీ టేక్ చెప్పిన వెంటనే మూడు, నాలుగు పేజీల డైలాగు సింగిల్ టేక్ లో చెప్పేస్తాడు. అసలు ఆయన సెట్ లో డైలాగ్ పేపర్ చూడటం నేను ఎప్పుడూ చూడలేదు. ఆయన కెమెరా కోసం పుట్టాడు అనిపిస్తుంది. ఆయన నటన చూస్తుంటే కెమెరా కోసమే పుట్టాడు అనిపిస్తుంది. ఆయన ఒక వండర్ కిడ్ ” అంటూ సుధాకర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఇక ఇదివరకే ఎన్టీఆర్ తో కలిసి నటించిన ఎంతోమంది నటీనటులు కూడా ఎన్టీఆర్ వ్యక్తిత్వం ఆయన నటన గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే.