Sudheer -Rashmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన వాటిలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన వారు ఉన్నారు. ముఖ్యంగా సుధీర్ రష్మీ ఈ కార్యక్రమం ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు.ఇకపోతే వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలను చూస్తే ఎవరికైనా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా అనే సందేహం కలగక మానదు. ఇలా రష్మీ సుధీర్ మధ్య లవ్ ట్రాక్ ఉందని పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేశాయి.అయితే వీటి గురించి ఇలాంటి వార్తలు రావడంతో వీరిద్దరి ఎప్పటికప్పుడు ఈ వార్తల స్పందించి తమ మధ్య ఏమి లేదని వెల్లడించారు.
ఈ విధంగా తమ మధ్య కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని పలు సందర్భాలలో వెల్లడించారు. అయితే ప్రస్తుతం సుధీర్ రష్మీ ఇద్దరూ ఒకే చానల్లో కాకుండా సుధీర్ మా టీవీ కి వెళ్ళిపోగా రష్మీ ఈటీవీలోనే జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఇలా వీరిద్దరూ విడిపోయినప్పటికీ వీరి గురించి ఇలాంటి వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సుదీర్ రష్మీ ట్రాక్ గురించి తాజాగా జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ షాకింగ్ కామెంట్స్ చేశారు.అందరూ అనుకున్నట్లు సుధీర్ రష్మీ మధ్య ఏ విధమైనటువంటి లవ్ ట్రాక్ లేదని వారిద్దరీ మధ్య ఎంతో స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని ఆర్పీ వెల్లడించారు.

Sudheer -Rashmi: షో రేటింగ్స్ కోసమే వారి చేత అలా చేయించేవారు..
మల్లెమాల వారు కేవలం షో రేటింగ్ కోసం మాత్రమే సుదీర్ రష్మీ చేత ఇలాంటి పర్ఫామెన్స్ లు చేయించేవారు. అంతకు తప్పితే వారిద్దరి మధ్య ఎలాంటి ట్రాకులు లేవు అంటూ ఆర్పీ ఈ సందర్భంగా వెల్లడించారు. జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో ఆర్పీ కూడా ఒకరు. అయితే మల్లెమాలవారికి ఆయనకు మధ్య మనస్పర్ధలు రావడం చేత జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు.అయితే ఈయన జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు రావడంతో మల్లెమాల వారిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. మల్లెమాలవారు సరైన ఫుడ్ కూడా పెట్టేవారు కాదంటూ ఈయన చేసిన ఆరోపణలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన ఆర్పీ స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ కార్యక్రమం ద్వారా సందడి చేస్తున్నారు.