Sudigaali Sudheer : అత్యంత ప్రజాదరణ పొందిన వారు తెలుగు బుల్లితెర మీద చాలా మంది సెలబ్రిటీలు వున్నారు అయితే వారిలో సుడిగాలి సుధీర్ ది ప్రత్యేకమైన స్థానం అనే చెప్పుకోవాలి. సుధీర్ తెలుగు బుల్లి తెరపై భారీ అభిమానులను కలిగి వున్న కొందరిలో ఈయన ఒకరు , అతని అభిమానుల సంఖ్య ఎలావుందీ అంటే ప్రముఖ హీరోల కంటే కాస్థ తక్కువగా ఉంది. సుధీర్ తన వైవిధ్యమైన నటన నైపుణ్యం , ఇంకా జబర్దస్త్ స్కిట్‌లు మరియు ఫన్నీ డైలాగ్‌లతో ప్రేక్షకులను మరియు అతని అభిమానులను అలరించడానికి ఏ మాత్రం ఆలోచించారు . తన మీద పంచులు వేసిన వాటినుండి కూడా కామెడీ చేయడానికే ప్రయత్నిస్తాడు.
ఈటీవీ ఢీ షో విజయం వెనుక, ఈటీవీ ఛానల్‌లో పలు పాపులర్ షోలు, ఫెస్టివల్ ఈవెంట్స్ ఇలా అన్ని విజయవంతం కావడం వెనుక సుధీర్ ఉంటాడు అనడంలో అతిషయోక్తి లేదు. సుధీర్ అభిమానులు తమ అభిమాన తార సంపాదన మరియు ఆస్తుల విలువ గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుడిగాలి సుధీర్ పోవే పోరా షోలో యాంకరింగ్ చేయడంతో పాటు ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీకి హోస్ట్‌గా వ్యవహరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సుదీర్ మరియు రష్మీ జోడిని స్మాల్ స్క్రీన్‌లో బెస్ట్ ఆన్ స్క్రీన్ జోడి అని కూడా పిలుస్తారు.
Sudigaali Sudheer సుడిగాలి సుధీర్ రెమ్యూనరేషన్, ఇంకా ఆస్తులు…..
అనేక కష్టాల తర్వాత సుధీర్ జబర్దస్త్ షోలో స్క్రీన్ స్పేస్ పొందగలిగాడు, అనేక ఇతర హాస్యనటుల లాగా కాకుండా, సుధీర్ పబ్లిక్‌గా క్రేజ్ సంపాదించిన తర్వాత కూడా ఈటీవీ కామెడీ షో నుండి వైదొలగలేదు. గత 8 సంవత్సరాలుగా సుధీర్ తన కామెడీ టైమింగ్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అతను తన నటనకు, డ్యాన్స్‌కి మరియు మేజిక్ విన్యాసాలతో అభిమానులలో పేరు సంపాదించుకున్నాడు.
స్మాల్ స్క్రీన్‌పై పూర్తి ప్యాక్ షెడ్యూల్‌లతో బిజీగా ఉన్న సెలబ్రిటీలలో అతను ఒకడు. టీవీ షోలు, డ్యాన్స్ ప్రోగ్రామ్‌లతో పాటు సినిమాల్లో కూడా పనిచేశారు. సుధీర్ సాఫ్ట్‌వేర్ సుధీర్ మరియు 3 కోతులలో హీరోగా నటించాడు మరియు ఇతర చిత్రాలలో అనేక చిన్న పాత్రలు పోషించాడు. కొన్ని సమాచారల ప్రకారం సుధీర్ సంవత్సర సంపాదన దాదాపు 50 లక్షలు. ఆయనకు రూ.25 కోట్ల ఆస్తులున్నాయి. సుధీర్ తన ప్రస్తుత రెమ్యునరేషన్‌గా రూ. 4 లక్షలు తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ లో బజ్ ఉంది. అంతే కాకుండా సుధీర్ కు హైదరాబాద్ లో రెండు ఇల్లులు కూడా వున్నాయి.