Sudigali Sudheer: ఢీ షో సుడిగాలి సుధీర్ మానేయడానికి కారణం ఏంటో తెలుసా?

Akashavani

Sudigali Sudheer: తెలుగు ప్రేక్షకులకు మల్టీ టాలెంటెడ్ గాయ్.. సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. బుల్లితెర జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన సుధీర్.. ఆ ఫేమ్ తోనే ప్రస్తుతం వెండి తెరపై కూడా హడావిడి చేస్తున్నాడు. సాఫ్ట్వేర్ సుధీర్ సినిమా తో తెలుగు ప్రేక్షకులను మరో లెవెల్ లో ఆకట్టుకున్నాడు.

మొత్తానికి సుధీర్ టాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తూ నటుడిగా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సుధీర్ ఎక్స్ ట్రా జబర్దస్త్ లో నవ్వులు పండిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అంతేకాకుండా ఢీ డాన్స్ షో లో కూడా అందాల భామ రష్మి తో కలిసి హడావిడి చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా సుధీర్ ఢీ డాన్స్ షో కి బ్రేక్ ఇచ్చాడు.

దీనికి కారణం సుధీర్ ను మల్లెమాల తప్పించింది. సుధీర్ కావాలనే ఆ షో నుంచి తప్పుకున్నాడు అంటూ అనేక రకాల ప్రచారాలు జరిగాయి. కానీ సుధీర్ అభిమానులు మాత్రం దాని వెనుక ఉన్న కారణం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా సుధీర్ హోస్ట్ గా చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి మనందరికీ తెలుసు.

కాగా మదర్స్ డే సందర్భంగా అమ్మాయిలు వర్సెస్ ఆంటీలు షో లో సుధీర్ కు ఒక ప్రశ్న ఎదురైంది. సుధీర్ ను తన ఫ్యాన్స్ నువ్వు ఢీ షో కి ఎందుకు రావడం లేదు అని అడుగుతారు. దానికి సుధీర్ నేను డీ షో ని ఎప్పుడు ఆపాను.. అని అంటాడు. నేను కొంతకాలం పాజ్ ఇచ్చాను.. ఐ విల్ బ్యాక్ వెరీ సూన్ అంటూ తన అభిమానుల నోరు తీపి చేసాడు.

Sudigali Sudheer: సుధీర్ తన అభిమానులకు ఈ విధంగా గుడ్ న్యూస్ తెలిపాడు!

ఇక సుధీర్ రాబోయే సినిమాల విషయానికొస్తే గాలోడు.. అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమా కు పి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా మే 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

- Advertisement -