Sudigali Sudheer:బుల్లితెర ఆర్టిస్టులు రష్మీ, సుధీర్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులే లేరు. జబర్దస్త్ షో తో అందరి హృదయాలను దోచుకున్నారు ఈ జంట. జబర్దస్త్ షోలో రష్మీ యాంకర్ గా అడుగుపెడితే సుధీర్ కమెడియన్ గా అడుగు పెట్టాడు. ఇక యాంకర్ గా రష్మీ తనకంటూ ఒక గుర్తింపు అందుకోగా.. కమెడియన్ గా సుడిగాలి సుధీర్ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.
అయితే ఈ షోలో వీరిద్దరికీ మంచి బాండింగ్ ఉండేది. నిజానికి వీరిద్దరిని చూస్తే ప్రేమలో ఉన్నారా అన్నట్లు కనిపించేది. ఎందుకంటే వీరిద్దరూ అలా ఉండేది కాబట్టి. చాలాసార్లు సుడిగాలి సుధీర్ రష్మీ ని ప్రపోజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇక రష్మీ కూడా సుధీర్ మాటలకు కరిగిపోయేది. ఇక ఇద్దరు కలిసి చేసే డ్యాన్సులు మాత్రం మామూలుగా ఉండేది కాదు.
నిజానికి వీరిద్దరిని చూస్తే పెళ్లి కాకున్నా కూడా క్యూట్ కపుల్స్ గా కనిపిస్తారు. అయితే గత కొన్ని రోజుల నుండి వీరిద్దరూ దూరమై ఇతర షోలలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుడిగాలి సుధీర్ ప్రస్తుతం కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనే కామెడీ షో లో యాంకర్ గా చేస్తున్నాడు. ఈయనతో పాటు మరో ఆర్టిస్ట్ దీపిక పిల్లి కూడా యాంకర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.
Sudigali Sudheer:
అయితే ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి సుధీర్ ఫ్యాన్స్ దీపిక పై పడ్డారు. ఇక తమ అభిమాన ఆర్టిస్టు సుధీర్ కు ఇక దీపిక పిల్లి మంచి జోడి అంటూ బాగా కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా దానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఆ ప్రోమో చూసిన నెటిజన్స్ మొత్తం దీపిక, సుధీర్ క్యూట్ కపుల్ అంటూ కామెంట్లు పెట్టగా.. రష్మీ ఫ్యాన్స్ మాత్రం సుధీర్, రష్మీ క్యూట్ కపుల్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.