Sudigali Sudheer: బుల్లితెరపై తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకొని మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఆర్టిస్టు సుధీర్. కెరీర్ మొదట్లో మ్యాజిక్కులు చేస్తూ అందరి దృష్టిలో పడిన సుధీర్ ఆ తర్వాత మల్లెమాల నిర్మాణంలో జబర్దస్త్ లో కమెడియన్గా అడుగు పెట్టాడు. ఇందులో తన కామెడీ టైమింగ్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను బాగా ఫిదా చేశాడు. వారిని అభిమానులుగా మార్చుకున్నాడు.
అంతేకాకుండా వెండితెరపై కూడా అడుగుపెట్టి హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక వ్యక్తిగతంగా ఈయన యాంకర్ రష్మితో ఎంతలా క్లోజ్ గా ఉండేవాడో అందరికీ తెలిసిందే. ఇక ఆమెతో నిజంగా లవ్ లో ఉన్నట్లుగా ప్రవర్తిస్తుంటాడు. అయితే గతంలో ఈయన కొన్ని కారణాలవల్ల జబర్దస్త్ కు దూరం కాగా కొంతకాలం శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకర్ గా చేశాడు.
ఇక ఆ షో ను కూడా వదిలేసి మరో షోలో చేస్తున్నాడు. అయితే ఈయన జబర్దస్త్ నుండి దూరమైనప్పటినుంచి జబర్దస్త్ కమెడియన్స్ స్కిట్లో భాగంగా సుధీర్ ను బాగా లాగుతున్నారు. బయటికి వెళ్లిపోయాడు అంటూ బాగా టార్గెట్ చేస్తున్నారు. దీంతో సుధీర్ అభిమానులు జబర్దస్త్ పై చాలా సార్లు ఫైర్ అయ్యారు. అయితే తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో కూడా సుధీర్ ను టార్గెట్ చేశారు.
Sudigali Sudheer:
ఓ కమెడియన్ వచ్చి రష్మితో.. తనకోసమే ఇక్కడికి వచ్చింది అన్నట్లుగా డైలాగు కొట్టగా.. వెంటనే మరో కమెడియన్ తనకు యువరాజు ఉన్నాడు.. ఇదివరకు మన రాజ్యంలోనే ఉండేవాడు అనటంతో వెంటనే ఇప్పుడు లేడా అని అడగటంతో పక్క రాజ్యంలో దండయాత్రకు వెళ్ళాడు అని అనటంతో.. మళ్లీ వస్తాడా అని ఆ కమెడియన్ అడగటంతో.. మళ్లీ వస్తే మన రాజ్యంలో ఉన్నవాళ్లు దండయాత్ర చేస్తామన్నారు అంతంతో అందరూ నవ్వుకున్నారు. దీంతో సుధీర్ ని టార్గెట్ చేసి మళ్లీ ఈ స్కిట్ చేయడంతో ఆయన అభిమానులు మరోసారి ఫైర్ అవుతున్నారు.