Sudigali Sudheer: సినీ లవర్ కి మల్టీ టాలెంటెడ్ గాయ్ సుడిగాలి సుధీర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. బుల్లి తెర జబర్దస్త్ ద్వారా సాగిన అతని ప్రయాణం ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ వరకు వచ్చింది. తన జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు అతను ఊహించని విధంగా కెరీర్ పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాడు.
మొత్తానికి సుధీర్ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో బాగా హడావిడి చేస్తున్నాడు. పలు షో ల లో యాంకర్ గా చేస్తూ కుర్రాళ్ళ లో ఎనలేని అభిమానం సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ కి సంబంధించిన ప్రోమో లో సుధీర్ చాలా ఎమోషనల్ గా కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. ఆ ప్రోమో లో బ్రేక్ అప్ కు సంబంధించిన పర్ఫామెన్స్ చూసి సుధీర్ మరింత ఎమోషనల్ అయ్యాడు.
ఆ పర్ఫామెన్స్ జరుగుతున్నంత వరకూ సుధీర్ కంటతడి పెట్టుకున్నాడు. ఇక పర్ఫామెన్స్ అనంతరం సుధీర్ తన పాత లవ్ స్టోరీ గురించి బయట పెట్టాడు. అంతే కాకుండా తన లవ్ స్టోరీని తలుచుకుంటూ చాలా బాధపడ్డాడు. ఇక ఒక్క సారిగా ఆ షోలో ప్రతి ఒక్కరిని సీరియస్ వైబ్స్ లోకి తీసుకొని వెళ్ళాడు. ఇక గెస్ట్ గా వ్యవహరిస్తున్న ఇంద్రజ సైతం సుధీర్ బాధపడడం తో చాలా వరకూ డల్ అయిపోయింది.
Sudigali Sudheer: సుధీర్ సక్సెస్ కావడానికి కారణం ఎవరో కాదు.. ఈమనే!
తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కారణం సుధీర్ వెల్లడించాడు. కుటుంబ బాధ్యతలు, తన కెరీర్ గురించి చెప్పుకుంటూ బాగా ఎమోషనల్ అయ్యాడు. అంతేకాకుండా ప్రస్తుతం ఇంత మంది అభిమానాన్ని సంపాదించడానికి కారణం కూడా ఆమె అని తెలిపాడు. ఒకరకంగా తన సక్సెస్ కి బ్రేక్ అప్ కూడా కారణమైందని తెలిపాడు. ప్రస్తుతం సుధీర్ కి సంబంధించిన ప్రోమో నెట్టింట్లో వైరల్ గా మారింది.