Sudigali Sudheer: సుడిగాలి సుదీర్ జబర్దస్త్ కార్యక్రమానికి రాకముందు చిన్న చిన్న ఈవెంట్లలో మిమిక్రీ చేస్తూ జీవనం కొనసాగించేవారు. అయితే ఈయన ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నారంటే అందుకు కారణం జబర్దస్త్ కార్యక్రమమని చెప్పాలి. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుడిగాలి సుదీర్ తన అద్భుతమైన కామెడీ టైమింగ్ పంచ్ డైలాగులతో విపరీతమైన క్రేజ్ ఏర్పరచుకున్నారు. ఇలా రోజురోజుకు బుల్లితెరపై ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న సుధీర్ ఏకంగా బుల్లితెర మెగాస్టార్ అనే టాగ్ వేయించుకున్నారు.
ఇలా ఈయన బుల్లితెరపై సెలబ్రిటీగా మారడంతో ఈయనకు ఏకంగా వెండితెర అవకాశాలు కూడా వచ్చాయి. ఇదివరకు పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నటువంటి సుధీర్ ఏకంగా హీరోగా అవకాశాలను కూడా అందుకున్నారు. ఇలా ఈయన హీరోగా నటించిన నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఈ క్రమంలోనే సుధీర్ ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అలాగే ఈయన నటించిన సినిమాలో ఎంత బడ్జెట్ లో తెరకెక్కాయనే విషయం గురించి హాట్ టాపిక్ గా మారింది.ఇండస్ట్రీలో సుధీర్ కి ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు సైతం తాము సినిమా కోసం పెట్టిన ఖర్చు ఈజీగా వసూలు అవుతుందని భావించి సుధీర్ ఒక్క సినిమాకు సుమారు ఐదు నుంచి 10 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ కేటాయిస్తున్నారు.
Sudigali Sudheer:సుధీర్ పై భారీ నమ్మకం పెట్టుకున్న నిర్మాతలు…
ఇలా బుల్లితెర నటుడిగా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుదీర్ సినిమాల కోసం భారీగానే డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.సుధీర్ ఒక్కో సినిమాకు సుమారు 60 నుంచి 80 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే సుధీర్ సినిమాకు ఈ స్థాయిలో బడ్జెట్ ఖర్చు పెట్టడం చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు.అయితే సుధీర్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ డబ్బులను ఈజీగా వసూలు చేస్తారనే ఉద్దేశంతోనే సుదీర్ సినిమాలకు భారీ బడ్జెట్ కేటాయించారు. మరి సుధీర్ నిర్మాతల నమ్మకాన్ని నిలబెడతారా లేక వారికి నష్టాలను మిగులుస్తారో తెలియాల్సి ఉంది.