Sudigali Sudheer: టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా మంచి గుర్తింపు పొందిన సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్ గా బాగా పాపులర్ అయిన సుధీర్ ఆ తర్వాత సినిమాలలో కమెడియన్ గా నటించే అవకాశాలు అందుకుంటున్నాడు. అంతేకాకుండా సుధీర్ హీరోగా కూడా సినిమాలలో నటించి హిట్ అందుకున్నాడు. సినిమా అవకాశాలు ఎక్కువగా రావడంతో జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు సుధీర్ దూరమయ్యాడు. ఆ తర్వాత ఇతర ఛానల్లో యాంకర్ గా వ్యవహరించి సందడి చేస్తున్నాడు. అయితే సుధీర్ ఈ షోలకు దూరం కావటంతో అతని అభిమానులు కొంతవరకు నిరాశ చెందారు.
అంతేకాకుండా సుధీర్ దూరం అవటంతో రష్మీ కూడా ఒంటరిగా మిగిలిపోయింది. సుధీర్ రష్మీ ఇద్దరు జంటగా బాగా ఫేమస్ అయ్యారు. వీరిద్దరూ కలిసి ఎక్కడ ఉంటే అక్కడ సందడిగా ఉంటుంది. వీరిద్దరూ టీవీ షోస్ కోసం ప్రేమికులుగా నటిస్తున్నారని అందరికీ తెలిసినా కూడా ఇద్దరూ నిజంగానే ప్రేమించుకుంటే బాగుంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే జబర్దస్త్ కి దూరమైన తర్వాత హైపర్ ఆది రాంప్రసాద్ సుధీర్ గురించి రష్మీ దగ్గర సెటైర్లు వేస్తూ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా సుధీర్ అభిమానులు ఆనందపడే విషయం ఒకటి జరగబోతోంది.
Sudigali Sudheer: శ్రీదేవి డ్రామా కంపెనీలో సందడి చేసిన సుధీర్…
ఇంతకాలం శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి దూరంగా ఉంటున్న సుధీర్ మళ్లీ షోలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే రష్మీ, ఆది, రాంప్రసాద్, నరేశ్ ఈ షోలో సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో సుడిగాలి సుదీర్ ఎంట్రీ ఇచ్చాడు. సుడిగాలి సుధీర్ ప్రస్తావన వస్తే మాత్రం రష్మీ తెగ సిగ్గుపడుతూ ఉంటుంది. వీరిద్దరూ నిజంగా ప్రేమికులు కాకపోయినా కూడా ఇద్దరి మధ్య చాలా రొమాన్స్ ఉంటుంది. ఈవారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో సుధీర్ ఇచ్చాడు. సుధీర్ వచ్చి రష్మి పక్కన నిలుచొగానే రష్మి సిగ్గుతో మెలికలు తిరిగిపోయింది. సుధీర్ తో పాటు గెటప్ శ్రీను కూడా ఈ షోలో సందడి చేశాడు. అయితే వీరు ఇకపై కంటిన్యూ అవుతారా లేక గెస్ట్ గా మాత్రమే వచ్చారా అన్నది తెలియాల్సి ఉంది.