Sudigalli Sudheer: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుడిగాలి సుధీర్ పేరు ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఇతడు ఆ షో తోనే తెలుగునాట ఎనలేని గుర్తింపు తన సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం పలు షో లలో యాంకర్ గా చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.
ఇక వెండితెరపై కూడా అడుగు పెట్టి అరడజను సినిమాలు చేసి నటుడిగా కూడా ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్నాడు. ఇక సుడిగాలి సుధీర్ కు టీవీ ప్రేక్షకులతో మంచి ర్యాపో ఉందని చెప్పవచ్చు. నిజానికి సుధీర్ కి అనేక షో ల నుంచి అవకాశాలు వస్తాయి. కానీ సుధీర్ జబర్దస్త్ షో ను వదలకుండా ఉంటాడు. దీనికి కారణం సుధీర్ అందరికంటే ఎక్కువ మొత్తంలో రెమ్యునేషన్ ఆ షో ద్వారా కలెక్ట్ చేసుకుంటాడని తెలుస్తుంది.
ఇక తాజాగా వచ్చిన సమాచారం మేరకు సుధీర్ కి జబర్దస్త్ వాళ్ళు ఎపిసోడ్ కు ఐదు లక్షలు ఇస్తారు అని తెలుస్తుంది. ఈ విధంగా సుధీర్ నెలకి జబర్దస్త్ షో ద్వారా ఐదు నుంచి ఆరు లక్షలు పుచ్చుకుంటాడని తెలుస్తుంది. అంతేకాకుండా ఢీ షో లో మెంటర్ గా, శ్రీదేవి డ్రామా కంపెనీ లో యాంకర్ గా 1.50 లక్షలు తీసుకునే వాడని తెలుస్తుంది.

Sudigalli Sudheer: సుడిగాలి సుధీర్ షో లకు, సినిమాలకు కలిపి ఈ విధంగా రెమ్యునేషన్ తీసుకుంటాడు!
ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ విషయానికొస్తే ఒక్కో ఎపిసోడ్ కి 80,000 రెమ్యునేషన్ తీసుకునే వాడిని తెలుస్తుంది. ఇక ఈ రెండు షోల ద్వారా సుధీర్ నెలకు పది లక్షలు ఏర్న్ చేసుకుంటాడని సమాచారం తెలుస్తుంది. ఇక షోల ద్వారా నెలకు 20 లక్షలు సంపాదిస్తున్న సుధీర్ చిన్న చిన్న సినిమాల్లో చేస్తే రెండు మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ఇక తాను హీరోగా నటించే సినిమాలకు మాత్రం 30-40 లక్షలు తీసుకుంటున్నాడని తెలుస్తుంది.