Suhasini : ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపుగా అందరూ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన తమిళ బ్యూటిఫుల్ హీరోయిన్ సుహాసిని గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే సుహాసిని ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉంటూ సాంప్రదాయమైన చీరకట్టులో నటించి పలు సెంటిమెంటల్ ఓరియెంటెడ్ పాత్రలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

ఈ క్రమంలో నటనా రంగంలో ప్రధానం చేసేటువంటి పలు అవార్డులను కూడా అందుకుంది. అయితే నటి సుహాసిని మొదటగా సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ సొంతంగా తన ప్రతిభను నిరూపించుకునే తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకుంది.

అయితే నటి సుహాసిని కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లయిన తర్వాత కూడా నటి సుహాసిని నటనకు బ్రేక్ ఇవ్వకుండా పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులని బాగానే అలరిస్తోంది.

అయితే ఈ మధ్యకాలంలో నటి సుహాసిని సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫోటోలను ప్రేక్షకులతో పంచుకుంటుంది. అయితే ప్రస్తుతం నటి సుహాసిని సెలవులను గడిపేందుకు ఇంగ్లాండ్ కి వెళ్ళింది. దీంతో అక్కడ దిగినటువంటి కొన్ని ఫోటోలను అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా నెటిజన్లతో పంచుకుంది. ఈ ఫోటోలకి ఫోజింగ్ ఫర్ సెక్…
ఇంగ్లాండ్ డైరీస్ అనే క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో కొందరు నెటిజన్లు నటి సుహాసిని ఫోటోలపై స్పందిస్తూ ఆమెపై ఉన్నటువంటి అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా నటి సుహాసిని కి 60 సంవత్సరాలు వయసు పైబడినప్పటికీ ఇప్పటికీ తన వన్నె తరగని అందంతో చూడటానికి చాలా అందంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే నటి సుహాసిని తెలుగులో సుమంత్ అక్కినేని హీరోగా నటించిన మళ్ళీ మొదలైంది చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది. కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి జి5 లో చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు. ప్రస్తుతం నటి సుహాసిని తెలుగులో సత్యదేవ్ మరియు తమన్నా జంటగా నటిస్తున్న గుర్తుందా శీతాకాలం చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.