Sujitha:సీనియర్ నటి కళ్యాణి గురించి అందరికీ సుపరిచితమే ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాత్రలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. కిరణ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నటువంటి కళ్యాణి కొంతకాలం పాటు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నప్పటికీ అనంతరం విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ విధంగా వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోవడానికి గల కారణాలను నటి సుజిత వెల్లడించారు.
బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్న సుజిత స్వయాన కళ్యాణి భర్త కిరణ్ కు చెల్లెలు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సుజిత తన అన్నయ్య కిరణ్ వదిన కళ్యాణ్ విడాకులకు గల కారణాలను తెలియజేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ వారిద్దరూ వృత్తిపరమైన జీవితాలలో ఎంతో సంతోషంగా బిజీగా ఉన్నారు. అయితే వాళ్ళు తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయమే వారి జీవితాలు ఇలా కావడానికి కారణమైందని సుజిత వెల్లడించారు.
Sujitha: ఆర్థిక సమస్యలే కారణం…
ఇండస్ట్రీలో మంచి సక్సెస్ సాధించినటువంటి అన్నయ్య దర్శకుడిగా స్థిరపడ్డారు. అయితే ఈయన నిర్మాతగా మారి ఒక సినిమాని నిర్మించారు. ఈ సినిమా కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత డిజాస్టర్ కావడంతో తీవ్ర అప్పుల పాలు అయ్యారని సుజిత తెలిపారు.అందరం తనకు సహాయం చేయాలని ప్రయత్నించినప్పటికే వారిద్దరి మధ్య పరిస్థితి చేయి దాటిపోయిందని తెలిపారు..కేరళలో ఎంతో విలువైన ప్రాపర్టీలు అన్నిటిని అమ్ముకున్నారని ఇలా ఆర్థిక సమస్యల కారణంగా ఇద్దరి మధ్య తీవ్రమైన గొడవలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు అంటూ ఈ సందర్భంగా సుజిత కళ్యాణి విడాకుల గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.