Sukumar: సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రమాదం నుండి కోలుకున్న తర్వాత సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మొట్టమొదటి సినిమా ఇది. ఈ సినిమా మీద ప్రేక్షకులు వారి అంచనాలు పెట్టుకున్నారు. తెలుగు, తమిళ్ భాషలలో విడుదల కానున్న ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఏలూరులోని సీఆర్ రెడ్డి కాలేజ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ సుకుమార్ చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు.
ఈ సందర్భంగా సుకుమార్.. ‘విరూపాక్ష’ డైరెక్టర్ కార్తిక్ వర్మ క్రిటికల్ మెడికల్ కండిషన్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ క్రమంలో సుకుమార్ మాట్లాడుతూ.. ‘‘ కార్తిక్‌కు ఒక మెడికల్ ప్రాబ్లెమ్ ఉండేది. తాను ఐదారేళ్లు మాత్రమే బతుకుతాడని డాక్టర్లు చెప్పారు. తను నా దగ్గరకు వచ్చినప్పుడు అతడు క్రిటికల్ కండిషన్‌లో ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా తన ఆరోగ్యం గురించి ఆలోచించకుండా చనిపోయేలోగా ఒక్క సినిమాకు అయిన దర్శకత్వం చేయాలని ఆశపడ్డాడు అని తెలిపాడు.
Sukumar: తన జీవితం చాలా చిన్నది…
అతని కోరిక చాలా బలమైనది. దీంతో దేవుడి ఆశీస్సులు తన తల్లి ఆశీస్సులతో క్రమంగా ఆ సమస్య నుంచి కోలుకుని ఈ సినిమాను విజయవంతంగా పూర్తి చేసి తాను అనుకున్నది సాధించాడు. అనారోగ్యం కారణంగా కార్తిక్.. నిరంతరం స్టెరాయిడ్స్ మీద బతికేవాడు.కానీ ఇప్పుడు ఆ సమస్య నుండి బయటపడి పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. అతను ఈ సినిమా పూర్తి చేసిన విధానం చూస్తుంటే సంతోషంగా , ఆశ్చర్యంగా ఉంది. ‘‘కార్తిక్.. చాలా చక్కగా ఈ సినిమా తీశాడు అని తన శిష్యుడైన కార్తీక్ గురించి సుకుమార్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.