Suma Adda: టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ ప్రస్తుతం సుమ అడ్డా అనే రియాలిటీ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సినీ సెలబ్రెటీలను ఆహ్వానించి వారిని ఇంటర్వ్యూ చేస్తూ వారి వ్యక్తిగత విషయాలను అందరికీ తెలిసేలా చేస్తుంది. ఇప్పటికే పలు ఎపిసోడ్లు పూర్తికాగా.. తాజాగా మరో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఇక ఈసారి సుమతో సందడి చేయడానికి అలీ, పోసాని కృష్ణమురళి వచ్చారు.
ఇక వారి ఎంట్రీ తోనే.. సుమ తన మాటలతో వారిని బాగా నవ్వించింది. ఆ తర్వాత ఫోన్ ఉండటం మంచిదా లేకపోవడం మంచిదా అని ప్రశ్నించగా.. వారిద్దరూ సరదాగా సమాధానాలు చెప్పారు. ఎటువంటి సోషల్ మీడియా ఖాతాలు లేవా అని సుమ అడగటంతో.. ఎందుకు అవన్నీ అంటూ పోసాని కౌంటర్ వేశాడు. అక్కడున్న స్టూడెంట్స్ ని కూడా అడగటంతో వారి సమాధానాలకు మెచ్చి అలీ వాళ్లకు చాక్లెట్ కూడా ఇచ్చాడు.
మధ్యలో పోసాని దగ్గరికి ఇద్దరు కమెడియన్స్ భార్యాభర్తలుగా వచ్చి.. అందులో లేడీ కమెడియన్ తనకు పిల్లలు కావాలి అని అడగటంతో.. వెంటనే పోసాని తన ఇంటి పక్క అడ్రస్ ఇచ్చి అక్కడ ఉండమని షాక్ ఇచ్చాడు. దాంతో అక్కడున్న వాళ్లంతా బాగా నవ్వుకున్నారు. ఇక స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు పోసాని తన స్టైల్ లో సమాధానం ఇచ్చాడు. మధ్యలో మరో లేడీ కమెడియన్ విద్యులేఖ వచ్చి భలే ఆటపట్టించింది.
Suma Adda:
ఇక ప్రోమో చివర్లో సుమ పోసానిని తన తండ్రి గురించి అడిగింది. ఇక ఆయన చిన్నప్పుడే చనిపోయాడు అంటూ.. ఆయనకు ఏ అలవాటు లేదు అని.. ఎవడో పేకాట నేర్పించాడు అని.. అలా కొన్ని సంఘటనల ద్వారా తండ్రి ఊర్లో వారి మాటలు తట్టుకోలేక వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలిపాడు. ఇక ప్రస్తుతం ఆ ప్రోమో బాగా వైరల్ అవుతుంది.