Suma Adda: టాలీవుడ్ ఎనర్జిటిక్ యాంకర్ సుమ ప్రస్తుతం సుమ అడ్డా అనే రియాలిటీ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు వచ్చి బాగా సందడి చేశారు. ఇక చిరంజీవి కూడా వచ్చి ఎంతలా హల్ చల్ చేశాడో చూసాం. అయితే తాజాగా వచ్చే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. అందులో ఈసారి గెస్ట్ లుగా హాలీవుడ్ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వచ్చి తెగ నవ్వించారు.
తమ ఎంట్రీ డాన్స్ తో బాగా ఫిదా చేశారు. సుమ మాత్రం తన మాటలతో వారిని బాగా నవ్వించింది. ఆ తర్వాత సుమ శేఖర్ మాస్టర్ ను ఈమధ్య హీరోయిన్లతో ఎక్కువగా వర్క్ చేస్తున్నట్టున్నాడు అని అనటంతో మీరు కూడా హీరోయిన్ కదా అంటూ సుమ పై పంచ్ వేశాడు శేఖర్ మాస్టర్. నేను కూడా గుర్తుకు చేసుకుందామని ఈ సంవత్సరం ఒక సినిమా చేశాను అని సుమ అనటంతో.. చేశారా అంటూ శేఖర్ మాస్టర్ తెలియనట్టుగా అడిగాడు. దానితో సుమ చాలా ఫీల్ అయినట్టు కనిపించింది.
ఇక సల్మాన్ ఖాన్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని జానీ మాస్టర్ ని అడగటంతో.. ఆయన సల్మాన్ గురించి చెబుతూ ఆయన అందరికీ హెల్ప్ చేస్తుంటాడు అని అన్నాడు. దాంతో సుమ ఆయనకు పెళ్లి కాలేదు కాబట్టి అలా హెల్ప్ చేస్తున్నాడు అని పంచ్ వేసింది. ఇక మధ్యలో చాలా విషయాలు పంచుకున్నారు ఇద్దరు మాస్టర్లు. ఆ తర్వాత సుమ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ లు ఒకరికొకరు ముద్దు పెట్టుకున్న వీడియోని రివిల్ చేసింది.
Suma Adda:
మధ్యలో కొంతమంది కమెడియన్స్ వచ్చి స్కిట్ చేయగా అందులో సుమ శేఖర్ మాస్టర్ ని కూడా లాగింది. ఆ తర్వాత మరో లేడీ కమెడియన్ విద్యుల్లేఖ ముసలి దాని లాగా తయారయ్యే వచ్చి తన భర్త రామ్ గోపాల్ వర్మ అంటూ బాగా రచ్చ చేసింది. ఇక మరో కమెడియన్ ప్రవీణ్ ఆ తాతకి చాలామంది భామలు ఉన్నారు అని అనటంతో.. మా ఆయన ఒక్క అమ్మాయి మొఖం కూడా చూడడు అని వర్మ గురించి ఒక డైలాగ్ కొట్టింది విద్యుల్లేఖ. దాంతో ప్రవీణ్ తాతకు అమ్మాయిల ముఖాలు చూడాల్సిన అవసరం లేదు అని.. ఇప్పుడు అమ్మాయిల కాళ్ళ దగ్గర్నే కూర్చుంటున్నాడు అంటూ వర్మను టార్గెట్ చేశారు. ప్రస్తుతం ఆ ప్రోమో వైరల్ అవుతుంది.