Supritha: తెలుగు రాష్ట్రాల ప్రజలకు యాక్టర్ సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకుని ప్రస్తుతం వెండితెరపై పలు సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తుంది. సోషల్ మీడియాలో సుప్రీత చేసే హడావిడి అంతా ఇంతా కాదు.
తన తల్లితో కలిసి సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో హడావిడి చేస్తోంది. నెట్టింట్లో తల్లి కూతుర్లు కలిసి స్టెప్పులు వేస్తూ ఉంటే.. చాలామంది వీళ్ళ ఇద్దరు అక్కాచెల్లెల్లు అనే అనుకుంటారు. మొత్తానికి సుప్రీత మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి ర్యాపో సంపాదించుకుంది. ఇక సుప్రీత త్వరలో లేచింది మహిళా లోకం అనే సినిమాతో ప్రేక్షకులను అలరించబోతోంది. దాంతో ఆ సినిమా టైటిల్ మరింత పాపులర్ అవ్వాలని ఏకంగా బాలయ్య కు సంబంధించిన వీడియోను వాడుకుంది.
Supritha: బాలయ్య మహిళాలోకానికి కొట్టి లేపాడు అని ఫన్నీగా చెప్పడానికి కారణం ఇదే!
ఇక బాలయ్య కు సంబంధించిన వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో పంచుకోవడం వల్ల ఆ టైటిల్ మరింత వైరల్ అయింది. ఒక సమయంలో బాలయ్య ప్రజల మధ్యకు వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. ఇక పక్కనే ఒక చిన్న పాపని ఎత్తుకొని ఒక తండ్రి ఉంటాడు. ఆ చిన్న పాప నిద్ర పోతూ ఉంటుంది. అది గమనించిన బాలయ్య ఆ చిన్న పాపను తట్టిలేపుతాడు. ఇక ఈ వీడియో కలెక్ట్ చేసుకున్న సుప్రీత తన సినిమా టైటిల్ కు బాలయ్య వీడియో ని జత చేసింది.
బాలయ్య ఆ వీడియో లో చిన్న పాపను లేపగానే.. నిద్ర లేచింది మహిళా లోకం అనే లా సుప్రీత నటించిన మూవీ పోస్టర్ వస్తుంది. ఈ స్టోరీ చూసిన నెటిజన్లు ఎంతో ఫన్నీ గా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం సుప్రీత స్టోరీ నెట్టింట్లో వైరల్ గా మారింది. మరి మీరు కూడా లేట్ చేయకుండా సుప్రిత ఇన్ స్టాగ్రామ్ స్టోరీ ఓపెన్ చేసి ఒక లుక్కేయండి. ఇక లేచింది మహిళా లోకం సినిమాలో సుప్రీత తన నటన ను ఏ విధంగా కనబరుచుటుందో చూడాలి.