Supritha: తల్లికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన సుప్రీత.. నీకు అన్ని డబ్బులు ఎక్కడివి అంటూ నెటిజన్స్ వెదవ ప్రశ్నలు?

Akashavani

Supritha: టాలీవుడ్ ప్రేక్షకులకు యాక్టర్ సురేఖ వాణి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. భద్ర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకున్న ఈమె.. ఆ తర్వాత బొమ్మరిల్లు, రెడీ, దుబాయ్ శీను వంటి సినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది.

దాదాపు 45 సినిమాలకు పైగా నటించి నటనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సురేఖ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ప్రతిరోజు తన కూతురు సుప్రీత తో కలిసి సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ ఉంటుంది. ఇక వీరిద్దరి వ్యవహారం సోషల్ మీడియాలో అక్క చెల్లెలు లాగా అనిపిస్తుంది.

వీరిద్దరూ ఇన్ స్టా రీల్స్ రూపంలో స్టెప్ లు వేసి నెటిజన్ల ను ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక తాజాగా ఇదే క్రమంలో సురేఖ వాణి బర్త్ డే సందర్భంగా తల్లీకూతుళ్లు సెలబ్రేషన్స్ మరో లెవెల్ లో జరుపుకున్నారు. ఫుల్ గా మందు తాగుతూ చిల్ అవుతూ కనిపిస్తున్నారు. ఇక ఇదే క్రమంలో థాయిలాండ్ కూడా వెళ్లి అక్కడ బ్యాంకాక్ వీధుల్లో బాగా హడావిడి చేస్తున్నట్లు కనిపించారు.

Supritha: సుప్రీత తన తల్లి కోసం ఖరీదైన గిప్ట్ ను ఇవ్వడానికి కారణం ఇదే!

మొత్తానికి అక్కడ సురేఖ వాణి బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక బర్త్ డే సందర్భంగా సురేఖ వాణి కూతురు సుప్రీత తన తల్లికి అద్భుతమైన గిఫ్ట్ ను ప్రజెంట్ చేసింది. డైమండ్ రింగును, చెవి రింగులు గిఫ్టుగా ఇచ్చినట్లు తెలుస్తోంది. వీటిని చూసిన సురేఖ వాణి ఆనందం అంతు పట్టలేనిదిగా మారిపోయింది.

అంత కాస్ట్లీ గిఫ్ట్ లు ఇచ్చి తనను సర్ప్రైజ్ చేసినందుకు.. ఎంతో ఆనందంగా ఫీల్ అవుతుంది. ఇక ఇది గమనించిన నెటిజన్లు నీకు ఆ గిఫ్ట్ లు కొనడానికి అన్ని డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయి అంటూ.. కామెంట్ల రూపంలో అడుగుతున్నారు. ఇక ఈ ప్రశ్నలకు సుప్రిత ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి

- Advertisement -