Supritha: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత చాలామంది సెలబ్రిటీలు సినిమాతోనే కాకుండా ఇలాంటి సోషల్ మీడియాతో కూడా హైలెట్ అవుతున్నారు. అలాంటి వాళ్లలో నటి సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రీత ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరూ ఏం చేసినా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ అవుతూ ఉంటారు.
వాళ్లు షేర్ చేసే ఫోటోలు కొన్ని హద్దులు దాటి నెటిజన్ల ట్రోల్స్ కి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా సురేఖవాణి ఆమె కూతురు సుప్రీత ఇద్దరు తల్లి కూతుర్లు లాగా కాకుండా అక్క చెల్లెలు లాగా మరి బోల్డ్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కూతుర్ని చేజేతులా పాడు చేస్తుంది సురేఖవాణి అంటూ పబ్లిక్ గానే ట్రోల్స్ కి గురవుతూ ఉంటుంది సురేఖ వాణి.
ఆ కామెంట్స్ ని పట్టించుకోని సురేఖవాణి ఆమె కూతురు వాళ్లు చేసే పని వాళ్లు చేసుకుపోతూ ఉంటారు. సురేఖ వాణి కూతురుగానే కాకుండా సుప్రీతకి ఇన్స్టాగ్రామ్ లో పెద్ద ఫాలోయింగ్ ఉంది. ఆమెని కూడా సినిమాల్లో పరిచయం చేయమంటున్నారు సురేఖవాణి అభిమానులు. సురేఖ వాణి కూడా అదే పనిలో ఉన్నట్లుగా సమాచారం.
ఇక సుప్రీత కూడా కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ లో కనిపించి అభిమానులని అలరించింది. అయితే సుప్రీత రీసెంట్ గా థాయిలాండ్ అకేషన్ కి వెళ్ళింది. అక్కడ తను ఎంజాయ్ చేసిన ప్రతి మూమెంట్ ని సోషల్ మీడియా ద్వారా అందరికీ షేర్ చేసింది. అందులో భాగంగానే తను పులి పిల్లతో ఆట్లాడుతున్న వీడియో ఒకటి షేర్ చేసింది సుప్రీత.
Supritha:
పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఆ పోస్టు వైరల్ గా మారడం గమనార్హం. ఇంత ధైర్యాన్ని ప్రదర్శిస్తున్న ఈ పిల్ల సినిమాల్లోకి వస్తే బాగుంటుంది అంటూ సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలని తెలియజేస్తున్నారు నెటిజన్స్. ఈ విషయం మీద సురేఖవాణి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.