Supritha: వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన సురేఖవాణి కూతురు.. అసలు విషయం బయటపెట్టిన మంచు లక్ష్మి!

Akashavani

Supritha: టాలీవుడ్ ప్రేక్షకులు యాక్టర్ సురేఖ వాణి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో సహాయ పాత్రలు చేసి నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సురేఖ వాణి ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తన కూతురు సుప్రీతో కలిసి తన లైఫ్ ను చిల్ అవుతుంది.

ఇక సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి మన అందరికీ తెలిసిందే. ఇక తల్లి కూతుర్లు కలిసి సోషల్ మీడియాలో చేసే హడావిడి అంతా ఇంతా కాదు. వీరిద్దరు తల్లి కూతుర్ల కంటే.. అక్క చెల్లెళ్ళు లా నెట్టింట్లో హడావిడి చేస్తారని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టీవ్ గా ఉంటూ సుప్రీత మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ నెట్టింట్లో షేర్ చేసుకుంటుంది.

ఇదిలా ఉంటే సుప్రీత త్వరలోనే వెండితెరపై కనిపించబోతుందని తెలిసింది. షార్ట్ ఫిలిమ్స్, ప్రైవేట్ ఆల్బమ్ తో స్టార్ట్ చేసిన తన కెరియర్ ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా చేసే వరకు వచ్చింది. ఇంతకు వివరాలకు వెళితే.. కార్తీక్, అర్జున్ కలిసి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘లేచింది మహిళా లోకం’. ఇందులో మంచు లక్ష్మి ప్రధాన పాత్ర పోషిస్తుంది.

Supritha: వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన సురేఖవాణి కూతురు.. అసలు విషయం బయటపెట్టిన మంచు లక్ష్మి!
Supritha: వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన సురేఖవాణి కూతురు.. అసలు విషయం బయటపెట్టిన మంచు లక్ష్మి!

Supritha: సురేఖ వాణి కూతురు గురించి.. మంచు లక్ష్మీ ఈ విషయం బయటపెట్టింది!

ఈ క్రమంలో మంచు లక్ష్మి సోషల్ మీడియా లో ఈ సినిమా పోస్టర్ ని పంచుకుంది. అంతేకాకుండా ఈ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలిపింది. కాగా ఈ సినిమాలో సుప్రియ తో పాటు, హరితేజ కూడా నటిస్తున్నట్లు మంచు లక్ష్మి వెల్లడించింది. అంతేకాకుండా శ్రద్దాదాస్ కూడా ఈ సినిమాలో మెయిన్ రోల్ చేస్తున్నట్లు తెలిపింది.

మంచు లక్ష్మి తన ఇన్ స్టాగ్రామ్ లో ఆ పోస్టర్ ని పంచుకొని దాదాపు రెండు రోజులు అవుతుంది. కాగా ఈ పోస్టర్ 2,767 ఇష్టాలను పొందింది. ఇక మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు కూడా ఆ పోస్టర్ వైపు ఒక లుక్కెయండి.

- Advertisement -