Mega Family: తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంతో మంచి క్రేజ్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈయన వారసులుగా ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోలు పరిచయమైన సంగతి మనకు తెలిసిందే. ఇక మెగా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి వారిలో ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు. ఇక వరుణ్ తేజ్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక త్వరలోనే ఈయన నటి లావణ్య త్రిపాఠిన పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి వివాహం నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో జరగబోతుందని తెలుస్తోంది.
ఇప్పటికే వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇంకా వీరి పెళ్లి తేదీ గురించి ఎక్కడ అధికారకంగా ప్రకటన తెలియజేయలేదు అయితే ప్రస్తుతం వీరి కుటుంబంలో పెళ్లి వేడుకలు మొదలయ్యాయని తెలుస్తోంది. మరి కొద్ది రోజులలో నటి లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలుగా అడుగుపెట్టబోతున్నటువంటి నేపథ్యంలో ఈమె గురించి ఎన్నో రకాల వార్తలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా కోడలు కాబోయే లావణ్యతో పాటు ఉపాసన చిరంజీవి భార్య సురేఖతో కూడా పోలుస్తూ కొన్ని విషయాలను ఆరా తీస్తున్నారు.
సేవాగుణంలో ఎవరు సాటిరారు…
మెగా ఇంటికి కోడలుగా అడుగుపెట్టినటువంటి సురేఖ ఉపాసన కాబోయే కోడలు లావణ్య త్రిపాఠి విషయంలో ఒక కామన్ క్వాలిటీ ఉందని తెలుస్తోంది. ఈ ముగ్గురు కూడా ఒక విషయంలో ఓకే మనస్తత్వం కలవారని తెలుస్తుంది. ఇప్పటికే సురేఖ ఉపాసన మెగా ఇంటి కోడలు అయినప్పటికీ ఎంతో మంచి మనసు సేవా గుణం ఉన్నటువంటి వారిగా కూడా గుర్తింపు సంపాదించుకున్నారు. ఉపాసన ఎంతోమందికి ఎన్నో రకాలుగా సేవలను అందిస్తూ తన మంచి మనసు చాటుకుంటూ ఉన్నారు అయితే ఉపాసనకు లావణ్య త్రిపాఠి కూడా ఏమాత్రం తీసిపోదని తెలుస్తుంది ఈమె సంపాదించే సంపాదనలో దాదాపు 50 శాతం సామాజిక సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తారట. ఎంతో మంచి మనసు ఉన్నటువంటి మెగా కుటుంబానికి అదే సేవాగుణం మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు కోడళ్లుగా అడుగుపెడుతున్నటువంటి నేపథ్యంలో మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.