Surekha Vani కూతురితో కలిసి బ్యాంకాక్ లో చిల్ అవుతున్న సురేఖ వాణి… మామూలుగా లేదు గా…

Joythi R

Surekha Vani సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత కొంతమంది నటీనటులకు మంచి ఫేమ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే ఇందులో కొందరికీ సిల్వర్ స్క్రీన్ మీద దాదాపుగా ఏళ్ల తరబడి నటిస్తున్నప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు షేర్ చేయడంతో చాలా మందికి మంచి క్రేజ్ పెరిగింది. ఇలా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్నటువంటి నటీనటులలో తెలుగు ప్రముఖ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి కూడా ఒకరు. సురేఖ వాణి టాలీవుడ్ లో అమ్మ, అక్క, చెల్లి, వదిన, తదితర పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ క్రమంలో దాదాపుగా 100కి పైగా చిత్రాలలో నటించింది.

అయితే ఈ మధ్య కాలంలో నటి సురేఖ వాణి కొంతమేర సినిమాలకు బ్రేక్ ఇచ్చి బ్యాంకాక్ కి వెళ్లి సెలవులను బాగానే ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు తన కూతురు సుప్రీత తో కలిసి షాపింగ్ లకు వెళ్ళడం, టూర్లకు వెళ్లడం వంటివి చేస్తూ చాలా జాలిగా గడుపుతోంది. ఈ క్రమంలో దిగినటువంటి ఫోటోలను కూడా తమ అధికారిక సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ బాగానే అలరిస్తోంది. అయితే తాజాగా నటి సురేఖ వాణి తన కూతురు సుప్రిత తో కలిసి షాపింగ్ కి వెళ్లి భారీగానే వస్తువులను కొనుగోలు చేసింది.

షాపింగ్ అనంతరం నటి సురేఖ వాణి తన కూతురు సుప్రీత తో మరియు వస్తువుల తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను తమ అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేసింది. దీంతో కొందరు సినీ నటి సురేఖ వాణి అందానికి ఫిదా అయ్యారు. అంతేకాకుండా నటి సురేఖ వాణి ఫోటోలపై స్పందిస్తూ తన కూతురు సుప్రీత కంటే నటి సురేఖ వాణి చాలా అందంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే ఏకంగా వయసు పెరిగేకొద్దీ నటి సురేఖ వానికి అందం కూడా పెరుగుతోందని కితాబు ఇస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల నటి సురేఖ వాణి తమిళంలో ప్రముఖ హీరో విజయ్ హీరోగా నటించిన చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది. కానీ ఈ చిత్రం నిడివి ఎక్కువగా ఉండటంతో నటి సురేఖ వాణి నటించిన సన్నివేశాలు డిలీట్ చేశారు. కాగా ప్రస్తుతం నటి సురేఖ వాణి తెలుగులో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరో తల్లి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -