Surekha Vani: నేనైతే ఫేస్ బుక్ వాడుతలేను.. మీకు రిక్వెస్ట్ వస్తే రిజెక్ట్ చెయ్యండి: సురేఖా వాణి

Akashavani

Surekha Vani: ప్రముఖ టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి సురేఖ వాణి ఒకరు. ఈమె ఎన్నో సినిమాలలో అక్క, వదిన, పిన్ని పాత్రలలో నటించి మంచి గుర్తింపు పొందారు.ఈ విధంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖవాణి కరోనా లాక్ డౌన్ సమయంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా సురేఖవాణి తన కూతురు సుప్రీతతో కలిసి చేసిన హంగామా మామూలుగా లేదు. నిత్యం తన కూతురుతో కలిసి చిన్న పిల్లలా పొట్టి దుస్తులు ధరించి సోషల్ మీడియా వేదికగా వీరు చేసే డాన్స్ వీడియోలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఈ విధంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంతో క్రేజ్ ఏర్పరుచుకున్న సురేఖవాణి పేరు పై కొందరు తప్పుడు ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలను సృష్టించి అందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపుతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.ఈ క్రమంలోనే ఈ వార్తలపై సురేఖవాణి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఎవరు కూడా నా నుంచి ఇలాంటి రిక్వెస్ట్ లు వస్తే యాక్సెప్ట్ చేయకండి అంటూ ఈమె వెల్లడించారు. తనకు ఇంస్టాగ్రామ్ అకౌంట్ తప్ప మిగతా సోషల్ మీడియా ఖాతాలు అయిన ఫేస్ బుక్, ట్విటర్ వంటి ఖాతాలు లేవని ఈ సందర్భంగా ఈమె తెలియచేశారు.

Surekha Vani: నేనైతే ఫేస్ బుక్ వాడుతలేను.. మీకు రిక్వెస్ట్ వస్తే రిజెక్ట్ చెయ్యండి: సురేఖా వాణి
Surekha Vani: నేనైతే ఫేస్ బుక్ వాడుతలేను.. మీకు రిక్వెస్ట్ వస్తే రిజెక్ట్ చెయ్యండి: సురేఖా వాణి

Surekha Vani: వెండితెర ఎంట్రీ ఇవ్వనున్న సుప్రీత…

ఈ విధంగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను ఎప్పటికప్పుడు ఈ విధమైనటువంటి ఫేక్ ఖాతాల వల్ల మోసపోకుండా వారిని అలర్ట్ చేస్తూ సురేఖవాణి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇకపోతే తన కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే సుప్రీత ఇప్పటికే ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ మంచి క్రేజ్ ఏర్పరచుకున్నారు. త్వరలోనే ఈమె కూడా లేచింది మహిళా లోకం అనే సినిమా ద్వారా వెండితెరకు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

- Advertisement -