Surekha Vani: సురేఖ వాణి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సాంప్రదాయానికి పెట్టింది పేరు అన్నట్టుగా సినిమాలలో చీరకట్టులో ఎంతో సాంప్రదాయబద్ధంగా కనిపిస్తూ తల్లి, పిన్ని, అక్క ,వదిన వంటి పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకులను సందడి చేస్తున్న సురేఖవాణి ఎన్నో తెలుగు సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సురేఖ వాణి నిత్యం తన కూతురుతో కలిసి పొట్టి దుస్తులు ధరిస్తూ హాట్ ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే కాకుండా డాన్స్ వీడియోల ద్వారా సోషల్ మీడియా వేదికగా అభిమానులను సందడి చేస్తుంటారు.
ఇలా వీరి డ్యాన్స్ వీడియోలను ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రోజురోజుకు అభిమానులను పెంచుకున్న సురేఖవాణి మరోవైపు నెటిజన్ల చేతిలో దారుణంగా ట్రోలింగ్ గురవుతూ ఉంటారు.ఇకపోతే తాజాగా సురేఖవాణి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా ఈమె ఎంతో వయ్యారంగా ఉయ్యాలలో ఊగుతూ అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాలోని తెలుసా.. తెలుసా ప్రేమించానని అనే పాటకు లిప్ సింక్ ఇస్తూ ఉన్నటువంటి వీడియోని షేర్ చేశారు.

Surekha Vani: పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్న విమర్శలు…
ఈ వీడియో క్షణాల్లో వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజెన్స్ ఈ వీడియోపై స్పందిస్తూ పెద్ద ఎత్తున సురేఖవాణినీ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నాలుగు పదుల వయసులో నీకు ఇది అవసరమా ఆంటీ అంటూ కామెంట్లు చేయగా.. మరి కొందరు నీ కూతురిని చూసుకోవడానికి వచ్చినవాడు నీకు ఓకే చెప్పేను జాగ్రత్త ఆంటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు నీ కూతురు పెళ్లి అయ్యేవరకు ఆగండి అంటూ ఈమెపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. మరికొందరైతే ఈమె వీడియో పై ప్రశంసలు కురిపిస్తూ ఎంతో అద్భుతంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.