Surekha Vani: సురేఖ వాణి పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి ప్రస్తుతం సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. ఇలా సినిమాలకు దూరమైనటువంటి సురేఖవాణి తన కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో చేసే హంగామా మామూలుగా లేదు తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి ఇంస్టాగ్రామ్ రిలీజ్ చేస్తూ పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు.తన భర్త మరణించిన తర్వాత సురేఖ వాణి తన కూతురితో కలిసి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ అయ్యారు.
భర్త మరణం తర్వాత తన కూతురితో కలిసి ఉంటున్నటువంటి ఈమె రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ తన పెళ్లి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి అయితే ఆ వార్తలను ఈమె ఖండించారు. సుప్రీత మాత్రం తన తల్లి చేసుకుంటానంటే తనకు రెండో పెళ్లి చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా తెలియజేశారు.ఇకపోతే ఈ తల్లి కూతుర్లు తరచూ వెకేషన్ లోకి వెళ్లడం పార్టీలు చేసుకోవడం వంటివి చేస్తూ ఉండడమే కాకుండా వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలను అభిమానులతో పంచుకుంటారు.
Surekha Vani: కూతురి బర్త్ డే కి సర్ ప్రైజ్ గిఫ్ట్…
ఈ క్రమంలోనే ఈ తల్లి కూతుర్లు ఇద్దరు ప్రస్తుతం యు ఎస్ వెకేషన్ లో ఉన్నారని తెలుస్తోంది. అక్కడ సంబంధించిన ఫోటోలు వీడియోలను సుప్రీత సురేఖ వాణి ఇద్దరు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. మరి కొద్ది రోజులలో సుప్రీత పుట్టినరోజు రావడంతో సురేఖ వాణి తన కుమార్తెకు ముందుగానే బర్త్ డే సర్ప్రైజ్ ఇచ్చి తనని సంతోష పెట్టారు. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో టైం స్క్వేర్ దగ్గర ఉన్న ఓ హోర్డింగ్ లో సుప్రీత తన తండ్రితో ఉన్న పిక్ ని డిస్ ప్లే చేసి అడ్వాన్స్ బర్త్ డే విషెస్ చెప్పింది. ఇలా తన తల్లి తనకు ఇచ్చినటువంటి ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ చూసి ఎంతో సంతోషపడినటువంటి సుప్రీత ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన తల్లికి థాంక్స్ చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు.