Surekha Vani: ఎన్నో సినిమాలలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి సురేఖ వాణి.నాలుగు పదుల వయసు దాటినా కూడా హీరోయిన్లకు పోటీగా అందాన్ని మెయింటైన్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఈ మధ్యకాలంలో సురేఖవాణి సినిమాలలో ఎక్కువగా కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా ఎక్కువగా ఉంటోంది. ప్రతిరోజు ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది. సురేఖ వాణి తన భర్త మరణించిన తర్వాత కూతురితో కలిసి ఎక్కువగా వీడియోలు చేస్తూ రచ్చ చేస్తోంది.
ఈ క్రమంలో కూతురు సుప్రితకి పోటీగా పోటీ బట్టలు వేసుకోని మరి డాన్స్ లు చేస్తోంది. ఈ వయసులో కూడా కుతురికన్నా అందంగా తయారవుతుంది. సోషల్ మీడియాలో ఈమె చేసే పోస్ట్ లకు కొన్నిసందర్భలలో విమర్శలు కూడా ఎదుర్కొంది. ముఖ్యంగా యువత సురేఖ వాణి ని ఆంటీ అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. మొన్నటి వరకు అల్లు అర్జున్ పాటతో ఇంస్టాగ్రామ్ లో సందడి చేసిన సురేఖ తాజాగా మరోక వీడియో చేసి పోస్టు చేసింది.

Surekha Vani: భారీగా ట్రోల్ అవుతున్న సురేఖ వాణి..
ఆ వీడియోలో సురేఖ వాణి ఒరేయ్ పంది వెదవ.. అమ్మాయిలకు బియర్డ్ ఉన్న అబ్బాయిలే ఇష్టం రా.. నువ్వేమో బియర్డ్ తీసేస్తానంటావ్ అని డైలాగ్ చెప్పింది. ఈ వీడియోలో సురేఖ వాణి అందం మరింత రెట్టింపు అయినట్టు ఉంది. సురేఖ వాణి ఇలా తన స్టైల్లో రీల్ వీడియో చేసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. మీకు కావాల్సిన బియర్డ్ ఉంది ఆంటీ.. నేను మీకు ఒకే నా? అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. నీకోసం ఇక అంకుల్స్ అందరు గడ్డం పెంచేస్తారేమో అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.