Surya Daughter: సౌత్ ఇండియన్ స్టార్ హీరోలలో ఒకరిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.సినిమా ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా గుర్తింపు పొందిన సూర్య నటి జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు కుమార్తె అనే విషయం మనకు తెలిసిందే. ఇకపోతే వివాహమైన తర్వాత జ్యోతిక పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైన పిల్లల బాధ్యతలను చూసుకుంటూ ఉన్నారు. ఇక సూర్య తనదైన శైలిలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక ఈయనకు షూటింగ్ సమయంలో ఏమాత్రం విరామం దొరికిన వెంటనే తన పిల్లలతో కలిసి ఎంతో సరదాగా గడపడానికి ఇష్టపడతారు.
సూర్య ముఖ్యంగా తన కూతురు దియాతో ఎంతో మంచి అనుబంధం ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం ఈమె తమిళనాడులోని ఒక ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి పూర్తి చేసింది.తాజాగా దియా పదవ తరగతికి సంబంధించిన పరీక్ష ఫలితాలు వెలువడటంతో ఈమె అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలుస్తోంది. దియా 500 మార్కులకుగాను 487 మార్కులు సాధించి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ప్రతి సబ్జెక్టులోనూ 95 శాతానికి పైగా మార్కులు రావడంతో ఈమె పదో తరగతికి సంబంధించిన మార్కుల జాబితా ప్రస్తుతం వైరల్ గా మారింది.ప్రతి ఒక్క సబ్జెక్టులోనూ తనకు 95% మార్కులు రాగా మ్యాథమెటిక్స్ లో మాత్రం వందకు వంద మార్కులు రావడం విశేషం.

Surya Daughter: కూతురు విజయానికి మురిసిపోతున్న తండ్రి
ఈ విధంగా దియా 95 శాతం పైగా మార్కులు సాధించడంతో తన టాలెంట్ ఏమిటో తెలిసిపోతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం దియా పదవ తరగతికి సంబంధించిన మార్కుల జాబితా వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజన్లు సూర్య అభిమానులు తన కూతురు మార్కుల జాబితా పై స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి కొందరు తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక తన కూతురు పదవ తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించడంతో సూర్య ఎంతో సంతోష పడుతున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా దియా సైతం తండ్రికి తగ్గ తనయగా ఎంతో టాలెంట్ ఉన్న అమ్మాయి గా పేరు సంపాదించుకుంది.