Susmitha Konidela: ఉపాసన రాంచరణ్ మరికొన్ని నెలలలో తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను కూడా ఎంతో సంతోషానికి గురి చేసింది.గత పది సంవత్సరాల నుంచి ఈ శుభవార్త ఎప్పుడు వింటామా అని ఎదురుచూస్తున్నటువంటి మెగా ఫాన్స్ ఈ విషయం తెలియగానే సంబరాలు చేసుకున్నారు.రామ్ చరణ్ 10 సంవత్సరాల క్రితం ఉపాసనను పెళ్లి చేసుకున్నప్పటికీ వీరిద్దరూ ఇప్పటివరకు పిల్లల గురించి ఏమాత్రం ఆలోచించలేదు.అయితే ఉపాసన తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది అంటూ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని అధికారకంగా తెలిపారు.
ఇలా చిరంజీవి రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారని తెలియజేయడంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఇక తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మెగా డాటర్ సుస్మిత ఈ సినిమా గురించి ఎన్నో విషయాలు మాట్లాడటమే కాకుండా చరణ్ కి పుట్టబోయే పిల్లల గురించి కూడా ఈమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలోనే చరణ్ కు అబ్బాయి పుట్టాలని కోరుకుంటున్నాను అంటూ తన మనసులో కోరికను బయటపెట్టారు.
Susmitha Konidela
ఈ సందర్భంగా సుస్మిత మాట్లాడుతూ చరణ్ ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారన్న వార్త మా ఫ్యామిలీలో ఎంతో సంతోషాన్ని తీసుకువచ్చిందని ఈ మూమెంట్ ను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నామని తెలిపారు.ఇక తనకు పాప లేదా బాబు ఎవరో ఒకరు పుడతారు అయితే తనకు మాత్రం బాబు పుట్టాలని కోరికగా ఉందని సుస్మిత తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇప్పటికే తన ఫ్యామిలీలో నలుగురు అమ్మాయిలు ఉన్నారని అబ్బాయి లేరు కనుక అబ్బాయి పుడితే ఆ కోరిక కూడా తీరిపోతుందని ఈ సందర్భంగా ఈమె చరణ్ కు కొడుకు పుట్టాలనీ సుస్మిత చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.