Swetha Menon : తమిళంలో ప్రముఖ దర్శకుడు పీకే రాజీవ్ కుమార్ దర్శకత్వం వహించిన రతినిర్వేదం చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటించిన ప్రముఖ మలయాళీ నటి శ్వేతా మీనన్ గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాగా నటి శ్వేతా మీనన్ సినిమా ఇండస్ట్రీలో తన కెరియర్ ప్రారంభించినప్పటినుంచీ ఏదో ఒక మెసేజ్ ఒరియెంటెడ్ చిత్రంలో నటిస్తూనే ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. ఈ క్రమంలో తన పాత్ర డిమాండ్ చేసిన విధంగా కొంతమేర బోల్డ్ గా కనిపించినప్పటికీ నటి శ్వేతా మీనన్ పాత్రలు మాత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
దాంతో నటి శ్వేతా మీనన్ కి ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులు అభిమానులుగా ఉన్నారు. అయితే నటి శ్వేతా మీనన్ కూడా ఈ మధ్యకాలంలో బోల్డ్ ఓరియెంటెడ్ పాత్రలలో నటించడం పూర్తిగా తగ్గించేసి నటనకు స్కోప్ ఉన్నటువంటి పాత్రలలో నటించడానికి ముగ్గు చూపుతోంది.
అయినప్పటికీ మరోవైపు అప్పుడప్పుడు అందాల ఆరబోత కూడా చేస్తూ తన అభిమానులను బాగానే ఆకట్టుకుంటుంది. శ్వేతా మీనన్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫోటోలు, వీడియోలు వంటివి షేర్ చేస్తూ నేటిజనులను బాగానే ఆకట్టుకుంటుంది. కాగా తాజాగా ఈ అమ్మడు బ్లాక్ కలర్ దుస్తులు ధరించి చెమట పట్టిన లుక్ తో కనిపిస్తూ కొంతమేర బోల్డ్ గా కొంటెచూపులతో కవ్విస్థూ దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ అమ్మడు అందాల ఆరబోతికి నెటిజన్లు ఫిదా అయ్యారు. అలాగే కొంతమంది నెటిజన్లు ఏకంగా నటి శ్వేతా మీనన్ కి 45 ఏళ్ల వయసు దాటినప్పటికీ తన వన్నెతెరగని అందంతో మతిపోగొడుతోందంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి శ్వేతా మీనన్ మలయాళం భాషలో దాదాపుగా మూడు కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తోంది. ఇందులో ఇప్పటికే రెండు చిత్రాలు షూటింగ్ పనులను పూర్తి చేసుకోగా మరో చిత్రం కేరళలో షూటింగ్ పనులు జరుపుకుంటున్నట్లు సమాచారం. అయితే తాజాగా నటి శ్వేతా మీనన్ తెలుగులో కూడా ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు పలు టాలీవుడ్ సిని వర్గాలు చర్చించుకుంటున్నాయి.