Swetha Varma: అవకాశం ఇస్తామని చెప్పి మోసం చేశారు.. గుండెముక్కలవుతుంది: శ్వేత వర్మ

Akashavani

Swetha Varma: సాధారణంగా ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలకు ఒక్కోసారి అవకాశాలు వచ్చినట్టే వచ్చి జారిపోతుంటాయి. ఇలా అవకాశాలు జారిపోవడంతో ఎంతోమంది సెలబ్రిటీలు చాలా బాధపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి శ్వేతా వర్మ ఒకరు. ఈమె బిగ్ బాస్ కార్యక్రమానికి రాకముందు నటిగా పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ తరువాత అందరికీ ఎంతో సుపరిచితమైన శ్వేత వర్మకు తాజాగా ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

ఈ క్రమంలోనే ఈ విషయం గురించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తూ వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేశారు. అయితే ఈ లోగా జరగాల్సింది మొత్తం జరిగి పోయింది.ఈమె పోస్ట్ డిలీట్ చేసే లోగా ఈ పోస్ట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె ఏ విషయం గురించి పోస్ట్ చేశారనే విషయానికి వస్తే తనకు బిగ్ బాస్ తర్వాత ఒక పాత్రలో నటించే అవకాశం కల్పించారని అయితే ఆ పాత్ర తనకు ఇవ్వకుండా ఎంతో ఇబ్బంది పెడుతున్నారని ఈమె తెలియజేశారు. ప్రస్తుతం ఈ విషయం తనకు ఎంతో బాధాకరంగా ఉందని ఆయన తనకు ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదని శ్వేతా వర్మ చెప్పుకొచ్చారు.

Swetha Varma: అవకాశం ఇస్తామని చెప్పి మోసం చేశారు.. గుండెముక్కలవుతుంది: శ్వేత వర్మ
Swetha Varma: అవకాశం ఇస్తామని చెప్పి మోసం చేశారు.. గుండెముక్కలవుతుంది: శ్వేత వర్మ

Swetha Varma: డిలీట్ చేయడానికి కారణం ఏమిటి…

ఇక తన జీవితంపై తనకు నమ్మకం కలగడం కోసం ఒక వారం రోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని పోస్ట్ చేశారు. అయితే ఈమె ఈ విధమైనటువంటి పోస్ట్ చేయడానికి కారణం ఏమిటి? ఈ పోస్ట్ చేసిన వెంటనే ఎందుకు డిలీట్ చేశారు? అనే విషయం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.ఈ పోస్ట్ చేసిన వెంటనే శ్వేత వర్మ డిలీట్ చేయడంతో బహుశా ఈ పాత్రల్లో నటించే అవకాశం కల్పించి ఉంటారని కొందరు నెటిజన్లు భావిస్తున్నారు. లేదంటే సదరు నిర్వాహకులు తనతో మాట్లాడి ఏదైనా ఒప్పందం కుదుర్చుకుని ఉంటారని తెలుస్తోంది. మొత్తానికి ఈమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -