Tabu: బాలీవుడ్ నటీనటులు అజయ్ దేవగణ్,టబు గురించి మనందరికీ తెలిసిందే. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ ఉన్న నటీనటులలో వీరిద్దరూ కూడా ఉన్నారు. ఇకపోతే వీరిద్దరూ చిన్నప్పుడు నుంచి మంచి స్నేహితులు అన్న విషయం మనందరికి తెలిసిందే. వీరిద్దరూ కలిసి పలు సినిమాలకు పని చేయగా వాటిలో కొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద హిట్స్ గా నిలిచాయి. వారిద్దరూ కలసి విజయపథ్, హకీకత్, తక్షక్, గోల్ మాల్ ఎగైన్, దే దే ప్యార్ దే ఇలాంటి సినిమాల్లో కలిసి నటించారు. ఇకపోతే కొన్నేళ్ళ క్రితం వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం దృశ్యం. ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.
ఇక హీరో అజయ్ దేవగణ్, బాలీవుడ్ నటి కాజోల్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు పిల్లలు కూడా కలిగారు. కానీ టబు మాత్రం 50 ఏళ్లకు దగ్గర అవుతున్న కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. ఇకపోతే ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న టబు తనకు ఇప్పటి వరకు పెళ్లి జరగకపోవడానికి పెళ్లి చేసుకోకపోవడానికి కారణాన్ని వివరించింది. ఇంటర్వ్యూ లో భాగంగా టబు మాట్లాడుతూ.. తన కజిన్ సమీర్ ఆర్య పక్కింట్లో అదే కుటుంబం ఉండేదట. అతనికి అజయ్ మంచి ఫ్రెండ్ కావడంతో తనకు కూడా అజయ్ తో స్నేహం ఏర్పడింది అని తెలిపింది.

Tabu: అజయ్ ఎంతో ప్రొటెక్టివ్ పర్సన్…
అలా వారిద్దరూ తనపై ఒక కన్నేసి ఉంచేవారని, అంతేకాకుండా వారిద్దరూ పెద్ద రౌడీలు అని చెప్పుకొచ్చింది. ఎవరైనా ఆమె వెంట పడినట్లు వాళ్లకు తెలిస్తే వెంటనే కొడతాము అని బెదిరించే వారట. అలా అజయ్ వల్లే తాను సింగిల్ గా మిగిలి పోయానని, అజయ్ అప్పుడు అలా చేసినందుకు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాడని ఆశిస్తున్నాను అంటూ సరదాగా చెప్పుకొచ్చింది టబు. తాను అందరికంటే ఎక్కువగా అజయ్ కి రెస్పెక్ట్ ఇస్తానని, అజయ్ పిల్లవాడిలా ఉండటమే కాకుండా ప్రొటెక్టివ్ గా కూడా ఉంటాడని తెలిపింది టబు. అంతేకాకుండా అజయ్ సెట్ లో ఉన్నప్పుడు ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉంటుందని వారి మధ్య ఎటువంటి నియమాలు లేని ప్రత్యేకమైన బంధం ఉందని చెప్పుకొచ్చింది టబు.