Tamannaah: సుమ క్యాష్ కార్యక్రమంలో కన్నీళ్లు పెట్టుకున్న తమన్నా… కారణం ఏమిటో?

Akashavani

Tamannaah: గత దశాబ్దంన్నర కాలం నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో తమన్నా వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. కేవలం వెండితెర సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న తమన్నా తాజాగా ఎఫ్ 3 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇకపోతే ఎఫ్ 3 చిత్ర బృందం సుమ క్యాష్ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ కార్యక్రమం 200 ఎపిసోడ్ కావడంతో ముఖ్య అతిథులుగా ఎఫ్ 3 చిత్ర బృందం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సునీల్, తమన్నా, సోనాల్ చౌహాన్, అనిల్ రావిపూడి హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా తమన్నా కన్నీళ్లు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఎప్పటిలాగే సుమ ఈ కార్యక్రమంలో వీరితో ఎంతో సందడి చేస్తూ మాట్లాడారు. ఇలా ఒకరిపై మరొకరు పంచులు వేసుకొని ప్రేక్షకులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.

 

Tamannaah: సుమ పరువు తీసిన తమన్నా

ఇక సునీల్ తమన్నా కలిసి చిన్న పిల్లలు చాక్లెట్స్ కోసం ఎలా మారామం చేస్తారనే టాస్క్ కూడా చేసి చూపించారు.ఇకపోతే ఈ ప్రోమోలో భాగంగా సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి రష్మిక నటించిన మైండ్ బ్లాక్ పాట వేసి అందులో తమన్నా అద్భుతంగా నటించారు. అని సుమ అనడంతో వెంటనే తమన్నా అందులో నటించింది నేను కాదు రష్మిక అంటూ సుమ పరువు తీశారు. ఇలా అందరూ ఎంతో సందడిగా మాట్లాడుతున్న సమయంలోనే తమన్నా కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఈమె ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారనే విషయం తెలియాల్సి ఉంది.తమన్నా ఇంతగా ఎమోషనల్ అవడానికి గల కారణం ఏమిటి? ఎందుకు ఏడ్చింది? అనే విషయం తెలియాలంటే ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వేచి చూడాలి.

 https://youtu.be/oU2Ymf5pe1g

- Advertisement -