Tamannaah : న్యూ ఇయర్ ను సామాన్యులతో పాటు సెలబ్రెటీలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు న్యూ ఇయర్ ను ఘనంగా జరుపుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా కూడా న్యూ ఇయర్ ను బాగా సెలబ్రేట్ చేసుకుంది. గోవాలో ఈ మిల్కీ బ్యూటీ న్యూ ఇయర్ ను ఘనంగా జరుపుంది. తన బాయ్‌ఫ్రెండ్ తో కలిసి న్యూ ఇయర్ రోజు తమన్నా చిల్ అయింది. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేసింది.
న్యూ ఇయర్ రోజు రెడ్ డ్రెస్ లో తమన్నా మెరిసిపోయింది. రెడ్ డ్రెస్ లో తళుక్కుమంటూ కనిపించింది. న్యూ ఇయర్ పార్టీలో తన బాయ్‌ఫ్రెండ్‌కు ముద్దులతో ఊపిరాడకుండా చేసింది. ముద్దులతో బాయ్‌ఫ్రెండ్స్‌ను తడిపేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈ అమ్మడి బాయ్ ఫ్రెండ్ ఎవరనేది తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.
అయితే తమన్నా బాయ్‌ఫ్రెండ్ ఎవరో కాదు.. నటుడు విజయవర్మ. ఆయనతో తమన్నా ఘాటు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా వీరి లవ్ ఎఫైర్ నడుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. విజయ్ వర్మ పలు హిందీ సినిమాల్లో నటించి అక్కడ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక తెలుగుతో నాని హీరోగా వచ్చిన ఎంసీఏ సినిమాలో కూడా విజయ్ వర్మ నటించాడు. సినిమాల్లో వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారినట్లు చెబుతున్నారు.
Tamannaah :
త్వరలనే తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మని తమన్నా పెళ్లాడబోతుందని తెలుస్తోంది. హీరోయిన్లకు లవ్ ఎఫైర్ అనేవి కామన్. కానీ తమన్నా ఎప్పుడూ తన బాయ్‌ఫ్రెండ్ వివరాలను బయటపెట్టలేదు. ఇప్పుడు న్యూ ఇయర్ రోజు ఏకంగా పబ్లిక్ గా బాయ్‌ఫ్రెండ్ కు మద్దులిస్తూ కనిపించడంతో.. ఆమె ప్రేమ వ్యవమారం బయటపడింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని గురించే చర్చ జరుగుతోంది.