Tarakaratana: నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీ మరణించిన విషయం తెలిసిందే.జనవరి 27వ తేదీ లోకేష్ పాదయాత్రలో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన తారకరత్నను దాదాపు 23 రోజులపాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించారు. ఇలా ఈయనకు విదేశీ వైద్యుల సమక్షంలో చికిత్స నిర్వహించిన చివరికి మృత్యువు చేతిలో ఓటమిపాలయ్యారు. తారకరత్న మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు తన భార్య అలేఖ్య రెడ్డి తనని తలుచుకుంటూ ఎంతో ఎమోషనల్ అవుతున్నారు.
ఈ క్రమంలోనే అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా తారకరత్నతో తనకున్నటువంటి అనుబంధం గురించి వారి జ్ఞాపకాల గురించి పోస్టులు చేయడంతో ప్రతి ఒక్కరికి ఈ పోస్టులు కంటతడి పెట్టిస్తున్నాయి. తిరుపతిలో చివరిసారిగా కుటుంబ సభ్యులందరూ కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ నీతో ఇదే చివరి ప్రయాణం అవుతుందని ఊహించలేదు అంటూ ఎమోషనల్ నోట్ రాశారు.ఇక ఆయన పెద్దకర్మ రోజు గత వాలెంటైన్స్ డే సందర్భంగా తారకరత్న తనకు రాసినటువంటి లవ్ లెటర్ కూడా షేర్ చేస్తూ మిస్ యు సో మచ్ అంటూ ఈమె చేసినటువంటి పోస్ట్ అందరిని కంటతడి పెట్టింది.
Tarakaratana: చాలా మిస్ అవుతున్నా….
ఇలా తన భర్త చనిపోయి దాదాపు 20 రోజులు కావస్తున్న ఇంకా ఆ బాధ నుంచి అలేఖ్య రెడ్డి బయటపడలేదని తెలుస్తోంది. ఇప్పటికీ తన భర్తను తలుచుకొని ఏడుస్తూ ఉండగా తన కుమార్తె నిషిక తన తల్లిని ఓదారుస్తూ ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా తన కుమార్తె రాసినటువంటి నోట్ షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.నిషిక తన తల్లి గురించి రాసుకోస్తూ అమ్మ నువ్వు చాలా బాధలో ఉన్నావు ఇంకొకసారి ఇలాగే ఏడుస్తూ ఉన్నావంటే నేను నీకు గుడ్ బాయ్ చెబుతా అంటూ రాసినటువంటి నోట్ అలేఖ్య సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇది షేర్ చేసినటువంటి అలేఖ్య నిన్ను చాలా మిస్ అవుతున్నామంటూ ఈ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.