Tarakaratna: నందమూరి తారకరత్న ఇటీవల అనారోగ్యంతో మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. తారకరత్న మరణం కుటుంబ సభ్యులను విషాదంలోకి నెట్టేసింది. తారకరత్న మరణించి రెండు నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ భార్యా పిల్లలు తలుచుకుంటూ బాధపడుతున్నారు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఇప్పటికీ భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలో తారకరత్నని తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ లు షేర్ చేస్తోంది. ఈ క్రమంలో నందమూరి అభిమానులు కూడా ఎమోషనల్ అవుతున్నారు .
తాజాగా తారకరత్నను తలుచుకుంటూ అలేఖ్య రెడ్డి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. తారకరత్న పిల్లలతో గడిపిన క్యూట్ మూమెంట్స్ ని వీడియో రూపంలో ఇంస్టాగ్రామ్ ద్వారా అలేఖ్య షేర్ చేసింది. ఈ వీడియో షేర్ చేస్తూ ఒక్క క్షణం కూడా నిన్ను మరువలేము అంటూ ఎమోషనల్ అయింది. ఈ పోస్ట్ చూసిన నేటిజన్స్ కూడా ఎమోషనల్ అవుతూనే అలేఖ్యకు ధైర్యం చెబుతున్నారు. ప్రస్తుతం అలేఖ్య రెడ్డి షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Tarakaratna: గుండెపోటుతో మరణించిన తారకరత్న..
ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన తారకరత్న ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు.తర్వాత హీరోగా హిట్స్ లేకపోవటంతో విలన్ గా కూడా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఇటీవల రాజకీయాలలో కూడా రాణించాలని భావించిన తారకరత్న ఆంధ్రప్రదేశ్లో టిడిపి తరఫున పోటీ చేయటానికి సిద్ధపడ్డాడు. ఈ క్రమంలో జనవరి 27న లోకేష్ ప్రారంభించిన యువగలం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత 23 రోజులు పాటు చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడిన తారకరత్న ఆఖరికి తుది శ్వాస విడిచాడు.