Tarakaratna: నందమూరి కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సక్సెస్ కాలేకపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారిలో నందమూరి తారకరత్న ఒకరు. ఈయన ఒకటో నంబర్ కుర్రాడు సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఈ సినిమాని శ్రీ వైజయంతి మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.ఇక సినిమా విడుదలయి పెద్దగా కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయిన నటన పరంగా తారకరత్నకు మంచి మార్కులే పడ్డాయి.
ఇక ఈ సినిమా తర్వాత ఈయన ఏకంగా తొమ్మిది సినిమాలకు ఒకే రోజు సంతకాలు చేసి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇలా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఈ రికార్డును మరే హీరో కూడా చెరపలేదని చెప్పాలి.ఈ విధంగా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును సృష్టించిన ఈయన ఈ తొమ్మిది సినిమాలు కూడా సక్సెస్ ఫుల్ గా విడుదల కాలేకపోయాయి. ఇందులో కొన్ని సినిమాలు పూజ కార్యక్రమాలతోనే ఆగిపోగా మరికొన్ని విడుదలైన పెద్దగా హిట్ కొట్టలేదు.ఇలా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నటువంటి తారకరత్నకు పెద్దగా సక్సెస్ రాకపోవడంతో ఈయన హీరోగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
Tarakaratna: లక్షల్లో రెమ్యూనరేషన్…
ఇలా హీరోగా దూరమైనప్పటికీ అనంతరం ఈయన విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే విలన్ పాత్రలలో నటించి మెప్పించిన తారకరత్న ఏకంగా నంది అవార్డును కూడా అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో తిరిగి బిజీ అవుతున్న తరుణంలోని ఈయనకు రాజకీయాల్లోకి రావాలని కుతూహలం ఏర్పడింది. ఇలా రాజకీయాలలోకి అడుగు పెట్టబోతున్న తరుణంలోని ఈయన గుండెపోటుకు గురై మరణించారు. ఇక ఈయన హీరోగా నటించిన మొదటి సినిమా ఒకటో నెంబర్ కుర్రాడు కోసం ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయం గురించి గతంలో ఓ సందర్భంగా అశ్విని దత్ మాట్లాడుతూ ఈ సినిమాకి తారకరత్న అన్ని ఖర్చులకు కలిపి 10 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వెల్లడించారు.