Tarakaratna: నందమూరి తారకరత్న మరణ వార్త నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.ఇలా తారకరత్న ఎంతో ఆరోగ్యంగా ఉంటూ ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయారు. అయితే ఈయనకు గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఈయనని బ్రతికించడం కోసం మెరుగైన చికిత్స అందించడానికి బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ఇలా 23 రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఈయన ఆరోగ్య విషయంలో ఏమాత్రం కోలుకోకపోవడంతో ఈయన ఫిబ్రవరి 18వ తేదీ సాయంత్రం కన్నుమూశారు. దీంతో ఒక్కసారిగా నందమూరి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇక తారకరత్న తన పుట్టినరోజుకు కేవలం మూడు రోజుల ముందు చనిపోవడంతో ఈ విషయం అభిమానులను కుటుంబ సభ్యులను ఎంతగానో బాధిస్తోంది. తారకరత్న ఫిబ్రవరి 22వ తేదీ తన 40వ పుట్టిన రోజుకావడంతో ఈ విషయాన్ని అభిమానులు గుర్తు చేసుకుని ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. ఇక తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి సైతం తారకరత్న పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. అయితే ఈమె చేసినటువంటి పోస్ట్ చూసిన అభిమానులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
Tarakaratna: మిస్ యు సో మచ్ అన్న..
ఈ క్రమంలోనే అలేఖ్య రెడ్డి తన పెద్ద కుమార్తె నిష్కతో తారకరత్న కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ నా జీవితంలో ఉత్తమ తండ్రి ఉత్తమ భర్త అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు..నిన్ను చాలా మిస్ అవుతున్నాం అంటూ ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక ఇది చూసినటువంటి ఎంతోమంది అభిమానులు మిస్ యు సో మచ్ అన్న అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇలా 39 సంవత్సరాల వయసులోనే తారకరత్న గుండెపోటుకు గురై మరణించడంతో అభిమానులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు అలేఖ్య రెడ్డి త్వరగా ఈ బాధ నుంచి బయటపడాలని ఆమెకు ధైర్యం ప్రసాదించమని భగవంతుడిని ప్రార్థిస్తూ పోస్టు చేస్తున్నారు.