Tarakaratna: నందమూరి తారక రత్న మరణ వార్త టిడిపి కార్యకర్తలలో నందమూరి అభిమానులను తీవ్రంగా కలిసి వేస్తోంది. మరోవైపు చిత్ర పరిశ్రమ కూడా తారకరత్న మరణ వార్త స్పందిస్తూ ఆయనకు పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తున్నారు.తారకరత్న హీరోగా పలు సినిమాలలో నటించిన సక్సెస్ కాలేకపోయారు దీంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు.
తిరిగి ఇప్పుడిప్పుడే ఈయన పలు సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తున్నారు. అదేవిధంగా టిడిపి తరఫున వచ్చే ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి సిద్ధమవుతూ పెద్ద ఎత్తున పార్టీ కార్యకలాపాలలో పాల్గొంటున్నారు.
గత కొద్ది రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తారకరత్న వచ్చే ఎన్నికలలో టిడిపి గెలుపే తన ధ్యేయమని పార్టీని తిరిగి అధిష్టానంలో తీసుకురావడం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
ఇకపోతే వచ్చే ఎన్నికలలో భాగంగా తాను కూడా అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయబోతున్నానని తారకరత్న తెలియజేశారు.ఈ క్రమంలోనే పార్టీ తరపున రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటూ పార్టీ ప్రచార కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు. అయితే వచ్చే ఎన్నికలలో తాను టిడిపి పార్టీ తరఫున పోటీ చేయబోతున్నానంటూ వెల్లడించిన ఆ కోరిక కూడా తీరకుండానే మరణించారు.
Tarakaratna: మహాప్రస్థానంలో అంత్యక్రియలు..
ఇలా రాజకీయాలలో రాణించాలనే తారకరత్న కోరిక కలిగిన కొద్ది రోజులకే ఆయన కోరిక కూడా నెరవేరకుండా గుండెపోటుకు గురై 23 రోజుల పాటు చికిత్స తీసుకుంటూ ఈయన తుది శ్వాస విడిచారు. ఇలా తారకరత్న మరణించడంతో ఇండస్ట్రీలోనూ ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలోనూ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తారకరత్న పార్థివ దేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఈయన భౌతిక కాయాన్ని మోకిలలోని తన సొంత నివాసానికి తరలించారు. సోమవారం సాయంత్రం మహాప్రస్థానంలో ఈయన అంత్యక్రియలు జరగనున్నాయి.