Tarakaratna: నందమూరి తారకరత్న ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన తారకరత్న అక్కడ సరైన గుర్తింపు లభించకపోవడంతో రాజకీయాలలో రాణించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ మేరకు జనవరి 27వ తేదీన నారా లోకేష్ ప్రారంభించిన యువగలం పాదయాత్రలో పాల్గొని మొదటి రోజే గుండెపోటుతో కుప్పకూలి పోయాడు. ఆ తర్వాత 23 రోజులు పాటు ప్రాణాలతో పోరాడిన తారకరత్న చివరికి తుది శ్వాస విడిచాడు. తారకరత్న మరణం ఆ కుటుంబంలో తీరని లోటు మిగిలింది.
తారకరత్న మరణంతో భార్య పిల్లలు ఒంటరిగా మిగిలిపోయారు. తారకరత్నని తలుచుకుంటూ ఆయన భార్యా అలేఖ్య రెడ్డి ప్రతిరోజు భర్తతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో తన బాధని పంచుకుంటోంది. ఇప్పటికీ ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతోంది. తాజాగా తారకరత్న కొడుకు తన తండ్రి ఫోటోను ముఖానికి అడ్డం పెట్టుకొని దిగిన ఒక ఫోటో అందరినీ కంట తడి పెట్టిస్తోంది. ఈ ఫోటోలను అలేఖ్యా రెడ్డి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో షేర్ చేస్తూ..పెద్దైన తర్వాత తండ్రిలా కావాలని అబ్బాయి అంటున్నట్లు ఈ ఫోటోల ద్వారా అలేఖ్య రెడ్డి వెల్లడించింది . దీంతో ఈ ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
Tarakaratna: తారకరత్నను దూరం పెట్టిన కుటుంబం..
కుటుంబ సభ్యులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న తారకరత్న అలేఖ్య దంపతులకు ముగ్గురు పిల్లలు. వివాహం తర్వాత మీరు కుటుంబ సభ్యులు వారిని దూరంగా పెట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు వారిని క్షమించలేదు. అయితే ఇటీవల తారకరత్న పుట్టినరోజు సందర్భంగా అలేఖ్య కుటుంబ సభ్యులు వారిని మన్నించినట్టు తెలుస్తోంది. అయితే తారకరత్న తల్లిదండ్రులు మాత్రం కొడుకు ఉన్నప్పుడు దగ్గరికి తీసుకోకుండా అతను మరణించిన తర్వాత చూడటానికి వచ్చారు. అంతేకాకుండా కొడుకు మరణించిన తర్వాత కూడా కోడలిని, పిల్లలను కూడా దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది.