Tarun: తరుణ్ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పుడు లవర్ బాయ్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తరుణ్ వరుస సినిమాలతో ఎంతో బిజీ అవుతూ ఎంతో మంది అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. అనంతరం ఈయన నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా సక్సెస్ సాధించలేకపోవడంతో ఈయన క్రమక్రమంగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి తరుణ్ కూడా రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే త్వరలోనే తరుణ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తన తల్లి రోజా రమణి వెల్లడించారు.
ఇకపోతే తాజాగా తరుణ్ గురించి ఒక క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తరుణ్ పెళ్లి వయసు దాటిపోయిన ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు అయితే త్వరలోనే ఈయన మెగా ఇటికి అల్లుడు కాబోతున్నారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తరుణ్ త్వరలోనే మెగా ఇంటికి అల్లుడు కాబోతున్నారన్న వార్త వైరల్ గా మారడంతో ఈయన ఏ ఇంటికి అల్లుడు కాబోతున్నారన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే తరుణ్ గురించి ఇలాంటి వార్త రావడానికి కారణం లేకపోలేదు .స్వయంగా తరుణ్ తల్లి రోజా రమణి చేసిన వ్యాఖ్యలు ఇందుకు కారణమని తెలుస్తోంది.
Tarun: ఎవరింటికి అల్లుడు…
రోజా రమణి గత కొద్దిరోజులు క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్వరలోనే తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలిపారు. ఇక తరుణ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇండస్ట్రీకి చెందిన ఓ బడా ఫ్యామిలీకి చెందిన అమ్మాయని తెలిపారు. దీంతో ఆ అమ్మాయి ఎవరా అని ఆరా తీశారు.అక్కినేని కుటుంబంలోనూ నందమూరి కుటుంబంలోనూ పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఎవరూ లేరు.ఇక దగ్గుబాటి కుటుంబంలో వెంకటేష్ కుమార్తె ఉన్నప్పటికీ ఈ అమ్మాయి చాలా వయసులో చిన్నది ఇక మిగిలినది మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీలో ఇప్పటికే నిహారిక శ్రీజ ఇద్దరు కూడా తమ భర్తలతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ క్రమంలోనే తరుణ్ ఇంటికి అల్లుడు కాబోతున్నారా ఒకవేళ మెగా ఇంటికి అల్లుడు అయితే చిరు ఇంటికా నాగబాబు ఇంటికా అనే సందేహాలను వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఈ వార్తను వైరల్ చేస్తున్నారు.