Tarun: మెగా డాటర్ నిహారిక తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యకు విడాకులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈమె తన భర్తకు విడాకులు ఇచ్చే ప్రస్తుతం ఒంటరిగా ఉన్నారు అయితే త్వరలోనే నిహారిక రెండవ వివాహం చేసుకోబోతున్నారని ఈమె ప్రముఖ నటుడు తరుణ్ తో తన పెళ్లిని జరిపించబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఒకప్పటి లవర్ బాయ్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి తరుణ్ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమయ్యారు అయితే త్వరలోనే ఈయన తిరిగి సినిమాల్లోకి రాబోతున్నారంటూ వార్త వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఒంటరి జీవితం గడుపుతున్నటువంటి తరుణ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా ఓ వార్త వైరల్ గా మారింది అయితే ఈయన మెగా ఇంటికి అల్లుడు కాబోతున్నారని మెగా డాటర్ నిహారికను పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలా తరుణ్ తన పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై స్పందించి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ గత రెండు రోజులగా సోషల్ మీడియాలో తన పెళ్లి గురించి చాలా వార్తలు వస్తున్నాయని తెలిపారు

Tarun: శుభవార్తను నేనే చెబుతాను…
ఇలా తన పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఆ వార్తలన్నీ కూడా ఆవాస్తవమేనని తెలియజేశారు. నా ప్రమేయం లేకుండా నా గురించి ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకు వస్తున్నాయో తనకు అర్థం కాలేదని తెలిపారు.ఇక అలాంటిది ఏమైనా ఉంటే ఆ శుభవార్తను ముందుగా తానే సోషల్ మీడియా వేదికగా అందరితోను పంచుకుంటానని తెలిపారు. అలాగే మీడియా సమావేశంలో భాగంగా ఆ శుభవార్తను అందరికీ తెలియజేస్తాను అంటూ తరుణ్ మెగా ఇంటికి అల్లుడు కాబోతున్నారని మెగా డాటర్ ను పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వస్తున్నటువంటి వార్తల పై స్పందించి క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ వార్తలకు పూర్తిగా చెక్ పడినట్లు అయింది.