Naresh: తెలుగు ప్రముఖ నటుడు నరేష్ మరియు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ ఈ మధ్యకాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరూ లేటు వయసులో ప్రేమాయణం మొదలుపెట్టి పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ఆమధ్య అధికారికంగా ప్రకటించారు ఈ క్రమంలో న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఏకంగా పెదవులపై ముద్దు పెట్టుకోవడంతోపాటు శాంపేయిన్ తాగుతున్న సమయంలో తీసిన వీడియోని కూడా సోషల్ మీడియాలోకి రిలీజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా వీరిద్దరూ సోషల్ మీడియా మాధ్యమాలతో పాటు ఇంటర్నెట్లో కూడా హార్ట్ టాపిక్ గా మారారు. ఆ తర్వాత నటుడు నరేష్ మూడో భార్య వీరిద్దరూ కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఓ ప్రముఖ హోటల్లో కలిసి ఉండడం గమనించి ఈ ఇద్దరు పై దాడి కూడా చేసింది.
ఈ విషయం ఇలా ఉండగా తాజాగా నటుడు నరేష్ మరియు పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకున్నటువంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియోలో నటుడు నరేష్ పెళ్ళికొడుకు దుస్తులలో ఉండటం అలాగే బంధువులు, పురోహితుడు సమక్షంలో నటి పవిత్ర లోకేష్ మెడలో తాళికట్టే తంతు ముగించడం వంటివి స్పష్టంగా కనిపించాయి. దీంతో వీరిద్దరి పెళ్లి ప్రస్తుతం మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వీడియో పై కొందరు భిన్నంగా స్పందిస్తున్నారు.
ఈ క్రమంలో వీరిద్దరికీ రెండు నెలల క్రితమే రహస్యంగా పెళ్లి అయిపోయిందని కానీ ప్రస్తుతం నరేష్ మూడో భార్య విడాకుల వ్యవహారం ఇంకా కోర్టులోనే ఉందని అందుకే గుట్టు చప్పుడు కాకుండా ఈ విషయాన్ని బయటికి రానివ్వలేదని అంటున్నారు. ఇంకొందరు మాత్రం ఇదేదో సినిమాలో సన్నివేశంలో ఉందని అలాగే కోర్టు వ్యవహారం తేలకముందే నరేష్ పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకుంటే లీగల్ గా కేస్ అవుతుందని అంటున్నారు.
దీంతో సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా నటుడు నరేష్ పెళ్లి వ్యవహారంపై అనేక కథనాలు వినిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ఓ ప్రముఖ వెబ్ సైట్ కూడా ఏకంగా నరేష్ మరియు పవిత్ర లోకేష్ లకి జనవరి నెలలోనే పెళ్లయిపోయిందని దీంతో ప్రస్తుతం వీరిద్దరూ దుబాయిలో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు అని కూడా రాసింది. అయితే సోషల్ మీడియా మాధ్యమాలలో వీరిద్దరి గురించి ఇంత రచ్చ జరుగుతున్నప్పటికీ ఇటు నరేష్ గాని అటు పవిత్ర లోకేష్ గాని స్పందించకపోవడం గమనార్హం.