Telugu Actress Affair క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో లవ్ ఎఫైర్ నడుపుతున్న సీనియర్ హీరో.. పెళ్లి చేసుకుంటారా..?

Joythi R

Telugu Actress Affair ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఇప్పటికే చాలా సందర్భాల్లో నిరూపణ అయ్యింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ ప్రేమ ఒకరితో ఆగడం లేదు. కొందరు ప్రేమ పేరుతో పెళ్ళిళ్ళు చేసుకోవడం, పెళ్ళయిన కొంతకాలానికే మనస్పర్ధలు, విబేధాలు రావడంతో విడిపోవడం, మళ్ళీ పథ ప్రేమ మర్చిపోయి కొత్త ప్రేమ పుట్టగానే ఇంకో పెళ్లి ఇలా ఈ ప్రేమ వ్యహారాలు ఒకరితో ఆగడం లేదు. కాగా తాజాగా టాలీవుడ్ కి చెందిన ఓ సీనియర్ హీరో లవ్ వ్యవహారం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు పలు కామెడి ఓరియెంటెడ్ చిత్రాలలో నటించి తన కామెడి నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ సీనియర్ హీరో 4వ పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికీ ఈ హీరో ఏకంగా మూడు పెళ్ళిళ్ళు చేసుకుని తన ముగ్గురి భార్యలతో విబేధాలు రావడంతో విడిపోయాడట. కాగా ఇందులో ఇటీవలే ఈ హీరో మూడో భార్య ఏకంగా ఈ హీరో పేరు వాడుకుని కోట్ల రూపాయలు అప్పులు చేయడంతో అప్పులు ఇచ్చినవాళ్ళు పోలీసులకి ఫిర్యాదు కుడా చేసినట్లు పలు వార్తలు వినిపించాయి.

అయితే తాజాగా ఈ సీనియర్ హీరో తెలుగులో పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఓ ప్రముఖ నటి తో ప్రేమాయణం సాగిస్తున్నాడని టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కోడై కోస్తోంది. ఐతే ఈ సీనియర్ హీరోతో ప్రేమలో పడిన నటికి కుడా సినిమా ఇండస్ట్రీలో మంచి పలుకుబడి ఉంది. అలాగే గత కొద్ది రోజులుగా తన భర్తతో గొడవలు రావడంతో ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం. ఐతే తాజాగా ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకుంది.

కాగా ఈ చిత్రంలో తన ప్రియుడైన సీనియర్ హీరో కీలక పాత్రలో నస్తున్నట్లు సమాచారం. దీంతో అప్పటి వరకూ వీరిద్దరి ప్రేమ వ్యవహారం సైలెంట్ గా ఉన్నప్పటికీ ఉన్నట్లుండి వీరికి సంబంధించిన సినిమా అనౌన్స్ మెంట్ రావడం తో ఒక్కసారి గా హాట్ టాపిక్ గా మారింది. దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయం పై స్పందిస్తూ వయసు మళ్ళిన సమయంలో 4వ పెళ్లి అవసరమా అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

- Advertisement -