Anjali : సినిమా అనేది రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో రాణించాలంటే ఒకోసారి ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలో మన టాలెంట్ కి తగ్గ అవకాశాలు రాకపోయినప్పటికీ పట్టు విడవకుండా శ్రమిస్తెనే ఫ్యూచర్ ఉంటుంది. లేకపోతే మాత్రం కెరియర్ ముగిసిపోవడం ఖాయం. అయితే కొందరు తమకు మంచి ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలు రాకపోవడంతో ఏదో విధంగా ఫేమ్ దక్కించుకోవడం కోసం నానా అవస్థలు పడుతున్నారు. కానీ సరైన బ్రేక్ వస్తే మాత్రం ఇలాంటి వారికి మంచి కెరియర్ తో పాటు సెలబ్రిటీ హోదా కూడా దక్కుతుంది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన తెలుగమ్మాయి అంజలి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అయితే నటి అంజలి తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయి అయినప్పటికీ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మాత్రం స్టార్ హీరోయిన్ హోదాని దక్కించుకోలేకపోయింది. అంతేకాకుండా అవకాశాల కోసం చతికిల పడింది. దీంతో అంజలి మన పొరుగు సినీ పరిశ్రమ అయిన కోలీవుడ్ కి ఆఫర్ల కోసం వలస వెళ్లింది. అయితే అంజలి టాలీవుడ్ లో హీరోయిన్ గా పెద్దగా క్లిక్ కాకపోయినప్పటికీ కోలీవుడ్ లో మాత్రం బాగానే క్లిక్ అయింది. ఈ క్రమంలో డజనుకు పైగా సినిమాలలో హీరోయిన్ గా నటించి తనకంటూ కొంతమంది అభిమానులను సంపాదించుకుంది. దీంతో ఈ మధ్య అంజలి పేరు ఇండస్ట్రీలో బాగా వినిపించడంతో మళ్ళీ టాలీవుడ్ లో ఈ అమ్మడికి ఆఫర్లు అడపాదడపా దక్కుతున్నాయి.
అయితే తాజాగా అంజలి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ జీవితం లో ఎదుర్కొన్న కొన్ని పరిస్థితుల గురించి ప్రేక్షకులతో పంచుకుంది. ఇందులో భాగంగా ఒక్కోసారి ఇష్టం లేని వ్యక్తులతో ముద్దు సన్నివేశాలలో నటించేటప్పుడు చాలా బాధగా ఉంటుందని ఎమోషనల్ అయ్యింది. అంతేకాకుండా ఇష్టం లేకపోయినప్పటికీ కెరియర్ కోసం నటించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఇలాంటి ముద్దు సీన్లలో నటించేటప్పుడు చాలా బాధ కలిగేదని, ఈ క్రమంలో క్యారవాన్ కి వెళ్లి ఏడ్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయని చెప్పుకొచ్చింది. కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ ఒక్కోసారి మనం అనుకున్నది సాధించడానికి కొన్ని తప్పక భరించాల్సి వస్తుందని, కచ్చితంగా ఏదో ఒక రోజు నటి అంజలికి సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదా దక్కుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.