Heroine : 2018వ సంవత్సరంలో టాలీవుడ్ లో విడుదలైన హుషారు చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకునే సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రానికి తెలుగు యంగ్ డైరెక్టర్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించగా యంగ్ నటీనటులైన ప్రియ వడ్లమాని, రాహుల్ రామకృష్ణ, దక్ష నాగర్కర్, మేడిశెట్టి అభినవ్, తేజ కూరపాటి, దినేష్ తేజ్, తేజస్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. అయితే ఇందులో దక్ష నాగర్కర్ హుషారు చిత్రం ద్వారా బాగానే పాపులర్ అయ్యింది. దీంతో ఈ అమ్మడికి పలు సినిమా ఆఫర్లు వరించినప్పటికీ దురదృష్టవశాత్తు సద్వినియెగం చేసుకోలేక పోయింది. అయితే ఇందుకు పలు వ్యక్తిగత కారణాలు, లేనిపోని భయాలు కూడా కారణమని ఆ మధ్య పలు ఇంటర్వ్యూలలో దక్ష నాగర్కర్ కూడా తెలిపింది. అయితే ఈ మధ్య ఈ అమ్మడు సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.
ఈ క్రమంలో ఈ ముంబై బ్యూటీ సినిమాల్లో పెద్దగా అలరించ లేకపోయినప్పటికి సోషల్ మీడియాలో మాత్రం తన అందమైన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ మతి పోగొడుతోంది. కాగా ఇటీవలే ఈ అమ్మడు పలు సెల్ఫీలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులతో పంచుకుంది. అయితే ఈ సెల్ఫీలలో దక్ష నాగర్కర్ ఏకంగా నాభి అందాలు, ఒంపుసొంపులతో కుర్రకారుని కట్టి పడేసింది. దీంతో నెటిజన్లు కూడా ఈ బ్యూటీ అందాల ఆరబోతకు ఫిదా అయ్యారు. అలాగే ఇప్పుడున్న పరిస్థితులలో తన అందచందాలకు మంచి డిమాండ్ ఉందని కాబట్టి సినిమా ఆఫర్ల విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటే మంచి భవిష్యత్ ఉంటుందని కాబట్టి అలోచించి నిర్ణయం తీసుకోమంటూ సూచిస్తున్నారు. అలాగే సరైన హిట్ పడితే ఈ అమ్మడికి కూడా టాలీవుడ్ లో మంచి ఫ్యూచర్ ఉంటుందని ఇంకొందరు అంటున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి దక్ష నాగర్కర్ తెలుగులో ప్రముఖ హీరో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర అనే చిత్రంలో రెండో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా శ్రీకాంత్ విస్సా కథని అందించాడు. అలాగే ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాత అభిషేక్ నామ నిర్మిస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.