Hamsa Nandini : ఒకప్పుడు పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించి బాగానే అలరించినటువంటి కొందరు హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నారు. ఈ క్రమంలో స్పెషల్ సాంగ్స్, గెస్ట్ అప్పియరెన్స్ కామియే అప్పియరెన్స్ వంటి పాత్రలలో నటిస్తూ అడపాదడపా కెరీర్లో నెట్టుకొస్తున్నారు . అయితే ఒకప్పుడు దాదాపుగా అరడజను పైగా చిత్రాల్లో హీరోయిన్ గా నటించి బాగానే అలరించిన తెలుగు బ్యూటిఫుల్ హీరోయిన్ హంసానందిని కూడా ఈ కోవకే చెందుతుంది.
అయితే ఈ అమ్మడు వచ్చిన కొత్తలో పర్వాలేదనిపించినప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం ఏకంగా ప్రముఖ హీరో ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి చిత్రంలోని మిర్చి మిర్చి అనే టైటిల్ సాంగ్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ పాట మంచి హిట్ అవ్వడంతో నటి హంసా నందిని కి మంచి కమ్ బ్యాక్ లభించింది. ఆ తర్వాత కొంతకాలం పాటు నటి హంసానందిని వరుస ఆఫర్లు దక్కించుకుంటూ బాగానే రాణించింది. అనుకోకుండా అనారోగ్య సమస్యల బారిన పడటంతో మళ్ళీ సినిమాలకి బ్రేక్ ఇచ్చింది.
అయితే నటి హంసానందిని సినిమాల పరంగా కొంత మేర ఇండస్ట్రీకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా మాధ్యమాలలో మాత్రం బాగానే యాక్టివ్గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది. అంతేకాకుండా అప్పుడప్పుడు పలు వాణిజ్య సంస్థల ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ బాగానే సంపాదిస్తోంది. అయితే తాజాగా నటి హంసానందిని రెనీ అనే కాస్మోటిక్ సంస్థకు సంబంధించిన లిప్స్టిక్ ల ను ప్రమోట్ చేస్తూ ఓ యాడ్ లో నటించింది.
అయితే ఈ యాడ్లో నటి హంసానందిని కొంతమేర గుండుతో కనిపించి తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకుల మతి పోగొట్టింది. అలాగే ఈ ప్రకటన వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే బాగా వైరల్ అయింది. అయితే ఎప్పుడూ చక్కని శిరోజాలు అందం అభినయంతో కనిపించే నటి హంసానందిని ఒక్కసారిగా గుండుతో కనిపించడంతో ఆమె అభిమానులు అవాక్కయ్యారు. దీంతో నటి హంసానందిని తాను ప్రస్తుతం కీమోథెరపీ తీసుకుంటున్నానని విజయవంతంగా కోలుకున్నానని తెలిపింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి హంసానందిని చివరిగా తెలుగులో ప్రముఖ హీరో గోపీచంద్ హీరోగా నటించిన పంతం అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది. ఆ తర్వాత మళ్ళీ పలు అనారోగ్య సమస్యలు కారణంగా సినిమాల్లో నటించలేదు. దీంతో హంసానందిని అభిమానులు బాగా మిస్ అవుతున్నారు. అలాగే తొందరగా అనారోగ్య సమస్యల నుంచి కోలుకుని మళ్ళీ సినిమాల్లో నటించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు.