Kasthuri : ప్రస్తుతం తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి మా ఛానల్ లో ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి ధారావాహిక మంచి టిఆర్పి రేటింగులు నమోదు చేస్తూ దూసుకుపోతోంది. అయితే ఈ ధారావాహికలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తున్న ఒకప్పటి హీరోయిన్ కస్తూరి శంకర్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటి కస్తూరి శంకర్ ఒకప్పుడు టాలీవుడ్లో పలు చిత్రాలలో కూడా నటించింది.
ఇందులో నాగార్జునతో కలిసి నటించిన అన్నమయ్య చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కానీ నటి కస్తూరి శంకర్ కి ఈ చిత్రంలో నటించిన తర్వాత తమిళంలో వరుస అవకాశాలు రావడంతో మళ్లీ టాలీవుడ్ పై దృష్టి సారించ లేకపోయింది. అయితే ఈ మధ్యకాలంలో నటి కస్తూరి శంకర్ కొంతమేర సోషల్ మీడియా మాధ్యమాలలో హాట్ టాపిక్ గా మారుతోంది.
అయితే తాజాగా ఈ అమ్మడు భారత ప్రముఖ క్రికెటర్ రాహుల్ పై చేసిన కామెంట్లకి కొందరు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే ఈ మధ్య కాలంలో నటి కస్తూరి శంకర్ ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు తలకు సంబంధించిన అందమైన ఫోటోలు, వీడియోలు వంటివి షేర్ చేస్తూ ఉండడంతో పాటు సినీ సెలబ్రిటీల విషయాలపై కూడా స్పందిస్తూ ఉంటుంది.
అయితే తాజాగా ప్రముఖ భారత క్రికెటర్ కెఎల్ రాహుల్ ఓ ప్రముఖ అండర్వేర్ సంస్థ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ ఓ ప్రకటనలో నటించాడు. అంతేకాకుండా ఈ యాడ్లో కొంతమేర సిక్స్ ప్యాక్ బాడీ చూపిస్తూ కనిపించాడు. అలాగే ప్రమోషన్స్ లో భాగంగా గా ఆ ప్రకటనలో నటించిన సమయంలో తీసినటువంటి ఫోటోలను తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేశాడు.
దీంతో నటి కస్తూరి శంకర్ కె.ఎల్.రాహుల్ అండర్వేర్ యాడ్ పై స్పందించింది. ఇందులో భాగంగా ఈ మధ్య కాలంలో చాలామంది క్రికెటర్లు కూల్ డ్రింక్స్, చిప్స్, ఆన్లైన్ గేమ్స్, వంటి వివిధ రకాల యాడ్స్ లో నటించారని కానీ అండర్వేర్ యాడ్స్ లో నటించడానికి గట్స్ కావాలని అలాగే కేఎల్ రాహుల్ కూడా ఎలాంటి బెరుకు బెరుకుగా లేకుండా అండర్వేర్ యాడ్లో బాక్సర్ లా కనిపించడం చాలా బాగుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఇంకేముంది నెటిజన్లు ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ విషయం ఇలా ఉండగా నటి కస్తూరి శంకర్ కెరియర్ మొదలు పెట్టింది టాలీవుడ్ సినిమా పరిశ్రమలోని అయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల టాలీవుడ్ సినీ పరిశ్రమలో కొనసాగలేక పోయింది. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం ఎక్కువగా తెలుగు చలనచిత్ర పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం నటి కస్తూరి శంకర్ కి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించే అవకాశాలు కూడా వరిస్తున్నట్లు సమాచారం.