Meena: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మాధ్యమాల్లో నీవు బాగా ఎక్కువ ఉండడంతో సినీ సెలెబ్రెటీల గురించి కొందరు తప్పుడు ప్రచారాలు అలాగే అవాస్తవ కధనాలు ప్రచారం చేస్తూ బాగానే పాపులర్ అవుతున్నారు. ఈ క్రమంలో సెలెబ్రిటీలు కాస్త ఈ ఫేక్ గాసిప్స్ మరియు తప్పుడు కథనాలకి స్పందించకపోవడంతో రోజురోజుకీ విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. అయితే తెలుగులో ఒకప్పుడు దాదాపుగా అందరి సీనియర్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి టాలీవుడ్, బాలీవుడ్, బాలీవుడ్ తదితర సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ సినీ నటి మీనా విషయంలో కూడా ఈ ఫేక్ వార్తలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి.
అయితే ఇంతకీ ఆ వార్తలు ఏమిటంటే ఇటీవలే నటి మీనా భర్త పలు అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందిన సంఘటన అందరికీ తెలిసిందే. దీంతో అప్పటినుంచి నటి మీనా తన కూతురు బాగోగులు చూసుకుంటూ ఒంటరిగానే ఉంటుంది. ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకూ నటి మీనా తమ బంధువుల ఒత్తిడి మేరకు అలాగే తన కూతురు భవిష్యత్తు మేరకు రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు పలు వార్తలు బలంగా వినిపించాయి. అలాగే మీనా కి కాబోయే వరుడు తమ బంధువుల్లోనే ఒకరని అంతేగాకుండా ఇప్పటికే మీనా తో వివాహం జరగబోయే వ్యక్తికి గతంలోనే పెళ్లయినప్పటికీ పలు వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్నాడని, అందుకే ఈ ఇద్దరికి రెండవ వివాహం జరిపించాలని తమ కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు రకరకాల వార్తలు వినిపించాయి. కానీ నటి మీనా మాత్రం తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేసింది. దీంతో అప్పటికప్పుడు నటి మీనా రెండో వివాహం గురించి వినిపిస్తున్న వార్తలు ఆగిపోయాయి.
అయితే తాజాగా మరో మారు నటి మీనా రెండో వివాహం గురించి సోషల్ మీడియా కొత్తగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా కోలీవుడ్ సినీ పరిశ్రమ కి చెందినటువంటి ఓ ప్రముఖ హీరో నటి మీనా ని రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు కొందరు బలంగా చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఆ హీరోకి పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారట. కానీ ఇటీవలే తన భార్యతో మనస్పర్ధలు విభేదాలు కారణంగా విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్నట్లు సమాచారం. అయితే నటి మీనా రెండో వివాహం పై ఎలాంటి క్లారిటీ లేకపోయినప్పటికీ ఇలాంటి ఫేక్ న్యూస్ మాత్రం రోజుకు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి కోలీవుడ్ ప్రముఖ హీరోతో పెళ్లి జరగబోతున్నట్లు వినిపిస్తున్న ఈ వార్తలపై నటి మీనా ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.