Madhavi : తెలుగులో ప్రముఖ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటించిన తెలుగు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాధవి కూడా తన నటనకు మంచి స్కోప్ ఉండటంతో బాగానే పాపులర్ అయింది. ఈ క్రమంలో మాధవికి ఏకంగా మిర్చి మాధవి అని పేరు కూడా వచ్చింది. అయితే తాజాగా నటి మిర్చి మాధవి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని మిర్చి మూవీ షూటింగ్ సమయంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.
ఇందులో భాగంగా ఈ చిత్రంలో నటించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ ప్రభాస్ చాలా కూల్ గా ఉంటాడని అంతేకాకుండా అందరితోనూ చాలా సరదాగా ఉంటాడని తెలిపింది. అయితే తను సినిమా షూటింగ్ సెట్ కి వెళ్లిన కొత్తలో ప్రభాస్ తో తాను పెద్దగా మాట్లాడలేదని కానీ తన ప్రభాస్ కి మంచి స్నేహితుడైన ప్రభాస్ శీను నాకు కూడా మంచి స్నేహితుడని దాంతో అప్పుడప్పుడు ప్రభాస్ గురించి తనతో చెప్పేవాడని తెలిపింది. ఈ క్రమంలో ఓసారి ప్రభాస్ ఏకంగా తనని చూపిస్తూ ఆ ఆంటీ కళ్ళు చాలా బాగున్నాయని ప్రభాస్ శీనుతో చెప్పినట్లు చెప్పుకొచ్చింది.
అయితే ప్రభాస్ కటౌట్ చూసి మొదట్లో తాను షాక్ అయ్యానని అలాగే ప్రభాస్ స్టైల్ గా సిగరెట్ కాల్చుతూ సెట్లో సరదాగా ఉంటాడని తెలిపింది. అయితే ప్రభాస్ తన ఫుడ్ డైట్ ని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాడని అందుకే అంత భారీ కాయంతో ఉంటాడని చెప్పుకొచ్చింది. ఇక టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో తనకు బాగా నచ్చిన హీరో ఎవరంటే అల్లు అర్జున్ పేరు చెప్పింది. అలాగే అల్లు అర్జున్ ప్రతి ఒక్కరితోనూ చాలా హుందాగా ఉంటాడని అంతేకాకుండా ఎవరైనా వచ్చి ఫోటోలు అడిగినా సరే ఏమాత్రం కాదనుకోకుండా ప్రతి ఒక్కరికి ఫోటోలు ఇచ్చి పంపుతాడని తెలిపింది. అయితే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ప్రవర్తన ఇప్పుడు అల్లు అర్జున్ లో చూశానని చెప్పుకొచ్చింది.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి మిర్చి మాధవి ఒకపక్క సినిమాలో నటిస్తూనే మరోపక్క సోషల్ మీడియా ఇన్ఫ్లెన్సర్ గా కూడా పనిచేస్తుంది. ఈ క్రమంలో పలు మోటివేషనల్ క్లాసెస్ తో చాలామందిని మారుస్తూ ఇన్స్పిరేషన్ గా మారింది.